Monday, October 20, 2025 02:41 AM
Monday, October 20, 2025 02:41 AM
roots

ప్రముఖ కంపెనీతో టచ్ లోకి లోకేష్.. గుజరాత్ వర్సెస్ ఏపీ..?

ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో తీవ్రంగా కష్టపడుతున్నారు. గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో పరిశ్రమలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపధ్యంలో.. ఇప్పుడు పరిస్థితులను దారిలోకి తెచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతోంది ప్రభుత్వం. ఐటీ, ఆటో మొబైల్ కంపెనీలను రాష్ట్రంలోకి తెచ్చేందుకు విదేశాల్లో పర్యటనలు చేస్తూ, అవసరమైన మార్పులు చేస్తోంది సర్కార్.

Also Read : గంజా బ్యాచ్ కు చుక్కలే.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల స్పీడ్

మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా పలు ప్రముఖ ఐటీ కంపెనీలను రాష్ట్రంలోకి తెచ్చేందుకు ఇటీవల చర్చలు జరిపింది. ఈ చర్చలు దాదాపుగా సక్సెస్ అయ్యాయి అనే చెప్పాలి. అటు కేంద్రం నుంచి కూడా సహకారం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు మరిన్ని ప్రముఖ కంపెనీలను తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి లోకేష్‌ తో మీటింగ్‌పై ఎయిర్‌బస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇండియాలో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం జరిపేందుకు చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది ఈ సంస్థ.

Also Read : తెలంగాణాలో పింక్ బుక్ లేదు.. సోషల్ మీడియా జాగ్రత్త.. డీజీపీ సంచలన కామెంట్స్

మంత్రి లోకేష్‌ విజ్ఞప్తితో షెడ్యూల్‌ ను ఈ సంస్థ మార్చుకుంది. ఏపీ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ఎయిర్‌బస్‌ సంస్థ ప్రకటించింది. భారత్‌లో ఎయిర్‌ బస్‌ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉన్నట్టు తెలిపింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని ఎయిర్ బస్ సంస్థ తెలిపింది. అయితే ఈ సంస్థను ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళకుండా అడ్డుకునేందుకు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్నారు. స్వయంగా కంపెనీ ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతున్నారు. కర్ణాటక లేదా గుజరాత్ వైపు సంస్థ చూస్తుందని తెలుసుకున్న మంత్రి.. దీనిపై వెంటనే అప్రమత్తమై సంస్థతో సంప్రదింపులు మొదలుపెట్టారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్