Wednesday, February 4, 2026 02:20 PM
Wednesday, February 4, 2026 02:20 PM

ఒక్క కామెంట్‌తో ఇండియాను ఫిదా చేసిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని కార్యక్రమాలతో పెద్ద సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ సంస్థలను కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దీనితో సాహసం చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని మార్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

Also Read : నిజంగానే చంద్రబాబు పగ తీర్చుకున్నారా..?

ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉండటంతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఆసక్తికర కామెంట్ చేశారు. స్పీక్ ఎనీ లాంగ్వేజ్, వేర్ ఎనీ క్లాత్స్, ఈట్ ఎనీ ఫుడ్ అంటూ లోకేష్ ఓ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ చూసిన జాతీయ మీడియా ఫిదా అయిపోయింది. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భాష విషయంలో ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. ఓ రాష్ట్రంలో తమ భాష మాట్లాడాలి అంటూ అక్కడ బతికే వారిని కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు చూసాం. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా హిందీ పై మమకారంతో కాస్త హడావుడి చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏ భాషైనా మాట్లాడొచ్చని.. ఏ దుస్తులైనా వేసుకోవచ్చని.. అంటే ఏ సాంప్రదాయాలైనా పాటించవచ్చని, ఇక తమకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు అంటూ లోకేష్ చెప్పడం చాలామందికి నచ్చేసింది.

Also Read : ముంచేసిన మిథున్ రెడ్డి.. జగన్ పని అయిపోయినట్లే

ప్రముఖ సోషల్ మీడియా పేజీల్లో సైతం ఈ కామెంట్ ను వైరల్ చేస్తున్నారు. ఈ తరహా కామెంట్ ఇప్పటివరకు ఏ రాష్ట్ర మంత్రి చేయలేదు. తమ రాష్ట్రంలో ఎంత స్నేహపూర్వక వాతావరణం ఉందో చెప్పేందుకు లోకేష్ ఆ పదాలను వాడారు. పెట్టుబడులు పెట్టే వారికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అని చెప్పడానికి ఎక్కువ సాగదీయకుండా సింపుల్ గా క్లోజ్ చేశారు లోకేష్. న్యూట్రల్ గా ఉండే ప్రముఖ సోషల్ మీడియా ఖాతాల్లో దీనిపై ఓ చర్చ కూడా జరుగుతుంది. లోకేష్ లో తక్కువ అంచనా వేసిన వైసిపి సోషల్ మీడియా కూడా ఈ విషయంలో అభినందించడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్