Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

ఒక్క టూర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్

ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కిన ప్రాధాన్యత ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సెన్సేషన్ అవుతుంది. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా లోకేష్ భేటీ అవుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి వివిధ అంశాలపై సహాయ సహకారాలు కోరేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేష్, బుధవారం పలువురు కేంద్ర మంత్రులను చాలా స్వేచ్ఛగా కలిశారు. రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, హెచ్డి కుమారస్వామి అలాగే అశ్విని వైష్ణవ్ లను వెంటవెంటనే కలిశారు నారా లోకేష్.

ఇక రాష్ట్రానికి ఏం కావాలనేది కేంద్ర మంత్రులకు నివేదికలతో సహా లోకేష్ అందించారు. ఢిల్లీ అరుదుగా వెళ్లే లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అతి పెద్ద పర్యటన ఇదే. లోకేష్ కేవలం అశ్వినీ వైష్ణవ్ ను మాత్రమే కలుస్తున్నట్టు మీడియాకు సమాచారం ఉంది. కాని ఇంత మందిని కలుస్తారని ఏపీ ప్రభుత్వ వర్గాలు కూడా ఊహించలేదు. కేంద్ర మంత్రులు కూడా లోకేష్ అపాయింట్మెంట్ కోరిన వెంటనే ఇవ్వటం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ భేటీలో రాజకీయపరమైన అంశాలకు కూడా లోకేష్ ప్రాధాన్యత ఇచ్చారు.

Also Read : రామ్ కోసం బాలయ్య.. ఫేట్ మారుతుందా..?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కూడా లోకేష్ భేటీ అయ్యారు. సాధారణంగా తన శాఖలపైనే కాకుండా ఇతర శాఖలపై కూడా కేంద్ర మంత్రులకు పలు వివరణలు, విజ్ఞప్తులు చేశారు లోకేష్. గత ఏడు నెలల్లో కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి అలాగే పోలవరం పనుల పురోగతిని రాజనాథ్ సింగ్ కు ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి తాము ముందు కూడా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని రాజనాథ్ సింగ్ కూడా లోకేష్ కు భరోసా ఇచ్చారు.

ఇక లోకేష్ ఢిల్లీ రావడంతో ఎంపీలు… అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఎక్కువగా ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ఎంపీలు చిన్ని, లావు కృష్ణదేవరాయలు, గంటి హరీష్ మాధుర్, సానా సతీష్ బాబు ఢిల్లీలోనే ఉండి లోకేష్ కు పూర్తి స్థాయిలో సహకరించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లోకేష్ పర్యటన ఆసాంతం తన కార్యక్రమాలు కూడా రద్దు చేసుకుని సమయం కేటాయించారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కాస్త సంచలనం అవుతుంది.

Also Read : నియోజకవర్గాలను మర్చిపోతున్న టీడీపీ మంత్రులు

సాధారణంగా ఢిల్లీ పర్యటనలకు ఎక్కువగా లోకేష్ ఆసక్తి చూపించరు. ఎప్పుడు వెళ్ళినా చంద్రబాబు నాయుడు మాత్రమే వెళుతూ ఉంటారు. అయితే ఇప్పుడు లోకేష్ వెళ్లి అన్ని శాఖలపై కేంద్ర మంత్రులకు నివేదికలు వినతి పత్రాలు ఇవ్వడం కాస్త సంచలనం అవుతుంది. పరిపాలనపై పట్టు పెంచుకోవడం, అటు కేంద్ర మంత్రులతో చంద్రబాబు లేకుండా తాను ఏంటీ అనేది చూపించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ఇక తాను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అనేది మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా ముందు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు ఆయన. ఇక ఢిల్లీ పర్యటనతో దృష్టి మొత్తం తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్