ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోగ్యం పై మంత్రి లోకేష్ తీసుకున్న శ్రద్ధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న నిమ్మల రామానాయుడు.. అలాగే అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనిపై నారా లోకేష్ సున్నితంగా నిమ్మల రామానాయుడుని హెచ్చరించారు.
Also Read : నారా లోకేష్ చొరవతో ప్రజల చేతిలో ప్రభుత్వం
అనారోగ్యం కారణంగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిన అవసరం లేదని, అవసరమైతే ఆయనను సస్పెండ్ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సూచించారు. అలాగే ఆయన అసెంబ్లీకి రావద్దని రూలింగ్ ఇవ్వాలంటూ కోరారు. ఇక అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన తర్వాత నిమ్మల రామానాయుడుతో నారా లోకేష్ సరదాగా మాట్లాడారు. మీకు సరైన నిద్ర ఉండటం లేదని.. అవసరమైతే తన యాపిల్ వాచ్ కొని పంపిస్తానని.. మీ స్లీప్ టైం మానిటర్ చేస్తాను అంటూ నారా లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు.
Also Read : భారత్ ఆ ఇద్దరినీ ఆపుతుందా…?
ఇక సస్పెండ్ చేయించాలా అంటూ సున్నితంగా హెచ్చరించారు నారా లోకేష్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పార్టీ నేతలతో నారా లోకేష్ సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ నేతలతో కలిసిపోయేందుకు లోకేష్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ప్రజల్లో ఎక్కువగా ఉండే నేతలకు.. లోకేష్ ప్రాధాన్యత ఇస్తారు అనే పేరు కూడా ఉంది. నిమ్మల రామానాయుడు కి అధిష్టానం వద్ద మంచి పేరుంది. దీనితో ఆయన ఆరోగ్యం పై లోకేష్ వేసిన ప్రశ్నలు, తీసుకున్న శ్రద్ధ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. లోకేష్ నాయకులను పట్టించుకోరు అనే కామెంట్స్ కు ఈ సంఘటన ఒక సమాధానం అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.