Friday, September 12, 2025 04:59 PM
Friday, September 12, 2025 04:59 PM
roots

లే ఆఫ్ ఎఫెక్ట్.. దెబ్బ గట్టిగానే పడుతుందా..?

హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పూణె నగరాలు శరవేగంతో అభివృద్ధి చెందడానికి ఏకైక కారణం… సాఫ్ట్‌వేర్. 1996 నుంచి హైదరాబాద్ నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సాఫ్ట్ వేర్ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ కారణంగా సైబరాబాద్ నగరం రూపుదిద్దుకుంది. ప్రస్తుత తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ నుంచే సగానికి పైగా వస్తుందే. అందుకే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో కూడా క్వాంటం వ్యాలీ ఏర్పాటును చంద్రబాబు సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. భారీగా పెట్టుబడులు వస్తాయని.. చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే.. సాధ్యమేనా అనే భయం వేస్తోంది.

Also Read : మార్చుకుంటారా.. లేదా.. లాస్ట్ వార్నింగ్..!

ప్రస్తుతం సాఫ్ట్ వేర్ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు అందరినీ భయపెడుతున్నాయి. పదేళ్లుగా సాఫ్ట్ వేర్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే యువత కూడా సాఫ్ట్‌వేర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అధిక ఆదాయం. లక్షల్లో జీతం.. దక్షిణాది రాష్ట్రాల్లోనే అధిక ఆదాయం తీసుకుంటున్న యువత ఎక్కువగా ఉన్నారు. వీరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువ. వీళ్లు చేస్తున్న ఖర్చులు కూడా భారీగానే ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కారణం. పెద్ద ఎత్తున ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక పెట్టుబడుల కారణంగా ఎన్నో రంగాల్లో దూకుడు కనిపిస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కారణంగానే హోటల్ సహా ఎన్నో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. యువత షాపింగ్, అవుటింగ్ అంటున్నారు. ఆన్ లైన్ ఆర్డర్లతో ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకు కూడా కార్పొరేట్ స్కూల్స్‌లో చేర్పిస్తున్నారు.

అయితే ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం లే ఆఫ్స్. ఆర్థిక కార్యకలాపాలలో సుదీర్ఘమైన, తీవ్రమైన క్షీణత వచ్చినప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా స్థూల దేశీయోత్పత్తి క్షీణత, నిరుద్యోగం పెరగడం, వినియోగదారుల విశ్వాసం తగ్గడం వంటి వాటితో ఉంటుంది. మాంద్యం కారణంగా లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. మాంద్యం ప్రభావం తట్టుకోలేని చిన్న చిన్న సంస్థలు మూత పడతాయి. పెద్ద సంస్థలు ఉద్యోగుల్లో కోత విధించి ఖర్చులు తగ్గించుకుంటాయి. సాధారణంగా మాంద్యం వల్లే సంస్థలు లే ఆఫ్స్ ప్రకటిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏఐ, ఆటోమేషన్. యాంత్రీకరణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని కలవరపెడుతోంది.

Also Read : మోడీ.. ఇది సిగ్గుచేటు.. సోనియా సంచలన కామెంట్స్ 

ప్రస్తుత యువతలో ఉద్యోగ భద్రత లేదనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం మాస్ లే ఆఫ్స్ సీజన్ నడుస్తోందనే చెప్పాలి. జిందాల్, టీసీఎస్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. టీసీఎస్ ఈసారి 12వేల మందిని లే ఆఫ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్‌ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగాల‍్లో 2 శాతం లే ఆఫ్స్‌ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంటెల్ సంస్థ నెల రోజుల్లోనే ఒరెగాన్‌లో 529 మంది ఉద్యోగులను తొలగించింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 23 వేల 486 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విస్తరించడంతో ఐటీ రంగంలో అనిశ్చితి ప్రారంభమయింది. బడా సంస్థలు సైతం ఏఐ విభాగంలోనే నియామకాలు చేపడుతున్నాయి. లే ఆఫ్ తప్పదని గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఐటీ ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

ఉద్యోగ భద్రత దినదినగండంగా మారడంతో.. ఐటీ ఉద్యోగులు ఖర్చు, పెట్టుబడుల విషయంలో కాస్త వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులైన ఇళ్ల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో బడా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఖరీదైన ప్రాజెక్టులను చేపడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌కు మించి మరీ లగ్జరీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వీటికి మొదట్లో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అటు వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడటం లేదనే మాట వినిపిస్తోంది. సాఫ్ట్ వేర్ సంస్థలో పెద్ద స్థాయిలో ఉన్న వారు కూడా ప్రస్తుతం ఇళ్లు కొనుగోలు చేసేందుకు సాత్ వెనకడుగు వేస్తున్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటున్నారనేది రియల్ ఎస్టేట్ సంస్థల మాట.

Also Read : బీసిసిఐ సంచలన నిర్ణయం.. వాళ్లకు గుడ్ బై..!

రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నో పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి. లక్షలాది మంది కార్మికులకు కూడా రియల్ ఎస్టేట్ రంగమే ఆధారం. సిమెంట్, స్టీల్, ఇంటీరియర్, గృహోపకరణాలు వంటి ఎన్నో పరిశ్రమలు రియల్ ఎస్టేట్ పై ఆధారపడినవే. ప్రస్తుతం లే ఆఫ్ కారణంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గిపోయాయి. దీని వల్ల ఇతర వ్యాపారాలు కూడా మందగించాయనేది వాస్తవం. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దీని వల్ల కొంతకాలం ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్ , ఏఐ సాంకేతికతలు రొటీన్ టాస్క్‌ల అవసరాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో ఐటీ దిగ్గజ సంస్థలు సైతం క్లయింట్ డిమాండ్‌లకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. అధునాతన సాంకేతికతలో స్కిల్ గ్యాప్ కారణంగానే ఈ లేఆఫ్స్ జరుగుతున్నాయనేది నిపుణుల మాట. ఏఐ, ఆటోమేషన్ ఐటీ రంగాన్ని శాసిస్తున్నాయి. దీంతో సంస్థలు కూడా అధునాతన సాంకేతికతల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆ దిశగా అప్ గ్రేడ్ అయిన ఉద్యోగులకు మాత్రమే సంస్థలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అప్ గ్రేడ్‌కు దూరంగా ఉన్న వారిపై లే ఆఫ్ వేటు పడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్