ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నూతన రైల్వే మార్గానికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా భూ సేకరకణ ప్రతిపాదనలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రతిపాదిత భూ సేకరణ భూములపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 16లోపు తెలపాల్సి ఉంటుందని తెలిపింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కు 297.499 ఎకరాలను సేకరించేందుకు ఈ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసారు.
Also Read : సార్… ప్లీజ్ ఆ ఆఫీసు మాకొద్దు…!
కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో 50.49 ఎకరాలు, పరిటాలలో 72.42, వీరులపాడు మండలం పెద్దాపురంలో 50.92 ఎకరాలు, గూడెం మాధవరంలో 7.71 ఎకరాలు, జుజ్జూరులో 28.89 ఎకరాలు, నరసింహారావుపాలెంలో 17.44 ఎకరాలు, చెన్నారావు పాలెంలో 26.45 ఎకరాలు, అల్లూరులో 43.15 ఎకరాల చొప్పున భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రతిపాదించిన భూముల్లో నూటికి 99 శాతానికిపైగా ప్రైవేటు భూములే అని ప్రభుత్వ భూములు చాలా తక్కువ అని తెలుస్తోంది.
Also Read : శిరిష జోలికి వస్తే.. సిక్కోలు నేతల వార్నింగ్..!
ఒకటి రెండు దేవదాయ భూములు కూడా ఉన్నాయట. పంచాయతీల పరిధిలో చాలా స్వల్ప సంఖ్యలో పుంత, పీడబ్ల్యూడీ కెనాల్, వాగు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. పరిటాలలో సర్వే నెంబర్ 8లో సుమారు 3 ఎకరాల వరకు కోర్టు కేసులో ఉన్న భూములను కూడా భూ సేకరణలో ఉన్నాయి. భూములను వెంటనే సేకరించటం కుదరదని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు కేసులు తేలితే తప్ప సేకరించలేని పరిస్థితి నెలకొంది. ఇవి కాకుండా పలుచోట్ల డొంకలు కూడా భూ సేకరణలో ఉన్నాయట. పరిటాలలో సర్వే నెంబర్ 13లో నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించిన భూమిలో 82 సెంట్ల మేర కోల్పోవాల్సి వస్తుందని… ఒకటి రెండుచోట్ల మాత్రమే అసైన్డ్ ల్యాండ్స్ ను తీసుకోవాల్సి వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.