Saturday, September 13, 2025 12:46 AM
Saturday, September 13, 2025 12:46 AM
roots

సజ్జలకు ముహుర్తం ఖరారు..? రంగంలోకి కడప కలెక్టర్

వైసిపి హాయంలో రెచ్చిపోయిన ఒక్కొక్కరికి ఇప్పుడు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలను ఒక్కొక్కరిగా అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అటు మీడియాలో వచ్చిన వార్తల పై కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. తాజాగా వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేసిన పోలీసులు.. త్వరలోనే మరికొంతమంది నేతలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది.

Also Read : వైసీపీ ప్రతాపం అంతా అక్కడేనా?

తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఉచ్చు బిగిస్తోంది ఏపీ ప్రభుత్వం. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్లో అటవీ భూములకు కబ్జాపై మరోసారి సర్వే కి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కడప ఆర్డీవో, డిఎఫ్ఓ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. నేటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్లో సర్వే నిర్వహించనుంది అధికారుల బృందం.

Also Read : అసలు జగన్ కు ఆ అర్హత ఉందా..?

కడప నగర శివారులో ఉన్న సజ్జల ఎస్టేట్లో 52.4 ఎకరాల ఫారెస్ట్ భూములను ఆక్రమించినట్లు ఓ ప్రముఖ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీనితో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రుల అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు అధికారులు. ఇటీవల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై పలు కథనాలను ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. అప్పట్లో సకల శాఖ మంత్రిగా రెచ్చిపోయిన సజ్జలపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్