ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైన నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోకి పలువురు నేతలు క్యూ కడుతున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. పలువురు కీలక నేతలను చంద్రబాబు నాయుడు తమ పార్టీలో జాయిన్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో టిడిపి కాస్త బలహీనంగా ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో టిడిపి బలోపేతం కోసం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఒక అగ్రనేత ఇప్పుడు టీడీపీ తీర్ధం పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన నారా లోకేష్ తో చర్చలు కూడా జరిపారని టిడిపి అంతర్గత సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ కీలక నేతతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని, తద్వారా ఆయనను టీడీపీలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసారని ప్రచారం జరుగుతుంది. ఆయనకు కీలక సీటు కూడా అవసరమైతే కేటాయించే ప్రయత్నం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే కడప జిల్లాకు చెందిన కొందరు నాయకులు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. టీడీపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్ళారని అంటున్నారు.
వైఎస్ కుటుంబంతో ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్న ఆ నాయకులు కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్ రెడ్డికి సీటు ఇవ్వడాన్ని ఏ మాత్రం ఇష్టపడటం లేదని, దీని మీద ఇప్పటికే పార్టీ అధిష్టానానికి తమ అభిప్రాయం చెప్పినా నిర్ణయం మార్చుకోకపోవడంతో కీలక అడుగులు వేసేందుకు సిద్దమయ్యారని అంటున్నారు. ఒకవేళ టీడీపీలోకి రాకపోయినా కాంగ్రెస్ లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. వారు కనుక టిడిపిలో చేరితే రాజకీయంగా పెను సంచలనం అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అభిప్రాయం.