అధికారం కోసం ఏదో ఒక సమస్య సృష్టించడం కొంతమంది నేతలకు బాగా అలవాటు. మంత్రిపదవి ఇవ్వలేదనే కారణంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో టీఆర్ఎస్ మంత్రులు కొనసాగారు కూడా. ఇక కేసీఆర్ కూడా యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేందుకు 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కేసీఆర్. రెండోసారి కూడా కాంగ్రెస్ గెలవడంతో మళ్లీ తెలంగాణ ఉద్యమం అంటూ హడావుడి చేశారు కేసీఆర్. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో.. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇదే తరహా డ్రామాలకు తెర లేపింది. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం నేతలతో కలిసి ప్రత్యేక రాయలసీమ పేరుతో హడావుడి చేశారు. కానీ అది పెద్దగా ఫలితం చూపించలేదు.
Also Read : అసలు సునామీ అంటే ఏంటీ..? సునామీలకు కారణాలు ఏంటీ..?
టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్ర మేధావుల ఫోరం పేరుతో చలసాని శ్రీనివాసరావు వంటి కొందరు.. ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేశారు. చివరికి అమరావతి నిర్మాణానికి కూడా అడ్డు తగిలారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుని.. రాజకీయంగా లబ్ది పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇదంతా నాటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే జరిగిందనేది బహిరంగ రహస్యం. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఈ సో కాల్డ్ మేథావులు, రాయలసీమ పోరాట యోధులంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే.. కనీసం కనిపించలేదు కూడా. జగన్ పాలనలో లెక్కలేనన్ని అరాచకాలు జరిగినా కూడా ఈ పెద్దలు పల్లెత్తు మాట అనలేదు. మూడు రాజధానులంటూ డ్రామాలు మొదలుపెట్టినా సరే.. మోథావుల ఫోరం సైలెంట్ అయ్యింది తప్ప.. ఏపీకి అన్యాయం జరుగుతోందని నోరు కూడా ఎత్తలేదు.
Also Read : జగన్‌కు వాళ్లు మాత్రమే సన్నిహితులా..?
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. జగన్ ఓడిపోయారు. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ బడా మేథావులు అని చెప్పుకునే వారంతా ఇప్పుడు మళ్లీ టీవీల ముందుకు వస్తున్నారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఉద్యమానికి తెర లేపారు కొందరు వైసీపీ అభిమానులు. పదేళ్ల క్రితమే ప్రత్యేక తెలంగాణ కావాలంటూ ఉద్యమం చేసి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పక్కన పెట్టిన కొందరు నేతలు.. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలంటూ డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని అప్పట్లోనే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కానీ తర్వాత దానిని పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి దానిని అస్త్రం కింద ప్రయోగం చేసేందుకు నానా పాట్లు పడుతున్నారు.
Also Read : ఐపీఎస్ సంజయ్‌కి సుప్రీంకోర్టులో భారీ షాక్
ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి.. రెండు రోజుల క్రితం బెంగళూరులో కొంతమంది ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని.. దీనిపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చర్చించాలని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. నీటి కేటాయింపులు, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి అంశాలపై పార్లమెంట్, అసెంబ్లీలో చర్చించాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతి, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అంటోందని.. రాయలసీమ గురించి పట్టించుకోవటం లేదని విమర్శలు చేశారు. సీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.