మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి బలోపేతంపై దృష్టి పెట్టిన ఆయన.. త్వరలోనే పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తాజాగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆయనకు అదృష్టం బాగుందని పర్సనాలిటీ పెంచుకుంటారు.. అనుకున్నానని అయితే పర్సంటేజీల పైన రేవంత్ కు ఆసక్తి ఎక్కువగా ఉందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : జగన్ కోసం విజయసాయి కొత్త స్ట్రాటజీ..?
ఢిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోవడంపై దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు. సూర్యాపేట సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫీనిక్స్ పక్షిలా పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఇక తన భవిష్యత్ కార్యాచరణ పై మాట్లాడిన కేటీఆర్.. వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. పాదయాత్ర పైకి చర్చ జరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని.. ఆ లక్ష్యం పైనే తన పాదయాత్ర ఉంటుందంటూ పేర్కొన్నారు.
Also Read : దొంగల్లా వస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలనం
సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించడమే తమ లక్ష్యమని.. ప్రజల్లో ముఖ్యమంత్రి పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడటం లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన పాదయాత్ర చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.