Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

ఫాం హౌస్ లో జగన్ తో కేటిఆర్ భేటీ

రాజకీయాల్లో కొన్ని భేటీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వైసీపీ – బీఆర్ఎస్ వంటి పార్టీలు స్నేహం చేస్తే జనాలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాని, టీడీపీ – బీఆర్ఎస్ స్నేహం చేస్తేనే కాస్త షాకింగ్ ఉంటుంది. 2018 తెలంగాణా ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య వాతావరణం హీట్ ఎక్కింది. అక్కడి నుంచి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. 2019 లో జగన్ అధికారంలోకి రావడం కూడా ఈ వైరాన్ని మరింత బలోపేతం చేసిందనే చెప్పాలి.

Also Read : మిథున్ కోసం సిట్ జల్లెడ.. ఎక్కడున్నాడో..?

అయితే ఈ మధ్య కాలంలో ఈ రెండు పార్టీలు స్నేహం చేసే అవకాశం ఉందనే ప్రచారం ఒకటి జరుగుతోంది. ఈ టైంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఓ సంచలన కామెంట్ చేసారు. లోకేష్ ను కేటిఆర్ అర్ధరాత్రి కలిసారన్నారు. ఎందుకు కలిసారో చెప్పాలని డిమాండ్ చేసారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. కేటీఆర్… లోకేష్ ను ఎందుకు కలిశావు సమాధానం చెప్పు అని డిమాండ్ చేసారు. కేటీఆర్, లోకేష్, కేటీఆర్, జగన్ రహస్యంగా భేటీ అయ్యారు అంటూ బాంబు పేల్చారు.

Also Read : జూబ్లీహిల్స్ బై పోల్.. సీన్‌లోకి కొత్త పేరు..!

కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు.. ఓ ఫార్మ్ హౌస్ లో లోకేష్.. జగన్ ను వేరు వేరు గా కేటీఆర్ కలిశాడని.. బీజేపీ డైరెక్షన్ లో ఈ భేటీ లు జరిగాయన్నాడు. సాటు కి సంసారం చేసేది మీరు.. బురద జల్లేది మాపైనా..? అంటూ మండిపడ్డారు. కేటీఆర్… అసలు ఏపీ మంత్రి లోకేష్ ను ఎందుకు కలిశావు సమాధానం చెప్పు అని నిలదీశారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరిన్ని విషయాలను జగ్గారెడ్డి బయటపెట్టడం విస్మయానికి గురి చేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్