తెలంగాణాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ… లగచర్ల ఘటనలో అడ్డంగా బుక్ అయిందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. లగచర్ల కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. దాడికి ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గుర్తించారు. నిందితుడు విశాల్ తోపాటు కొంతమంది సాక్షులను విచారించిన పోలీసులు… రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు.
Also Read : ప్రభాస్ లైనప్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే..!
నిందితుడు సురేష్‌ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్‌వాష్ చేసారని… నిందితులకు నరేందర్ రెడ్డి ఆర్థిక, నైతిక సాయం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టి మళ్ళించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. భూసేకరణ సర్వే సమయంలో అధికారుల దాడులు చేయాలని రెచ్చగొట్టాడు… అన్ని రకాల మద్ధతు ఉంటుందని హామీలు ఇచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. తమ పార్టీ ప్రముఖ నేత ఆదుకుంటారని రైతులకు హామీ ఇచ్చినట్టు పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read : ఆ ఇద్దరూ చేసిన పాపం ఏంటీ…?
పట్నం నరేందర్ రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించాడన్న పోలీసులు… ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి జరిగిందని పేర్కొన్నారు. నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడ్డానని నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. కేటీఆర్ ఆదేశాలతోనే ఈ కుట్రలకు పాల్పడినట్లు అంగీకరించారట నరేందర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నించినట్టు చెప్పాడు అని పోలీసులు పేర్కొన్నారు. ఇక నరేందర్ రెడ్డి ఫోన్ ను పోలీసులు సీజ్ చేసారు. ఈ కేసులో కేటిఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉండటంతో బీఆర్ఎస్ అధిష్టానం అలెర్ట్ అయింది.