ప్రతిపక్షాల ఎమ్మెల్యేల అధికార పార్టీలో జాయిన్ కావడం అనేది సహజంగా జరిగేదే. ప్రజాస్వామ్యానికి ఇది సరైన విధాన్నం కాకపోయినా ఈ మధ్య కాలంలో కామన్ అయిపొయింది. 2014 నుంచి ఇది మరింత ఎక్కువైంది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణాలో 2014 లో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్.. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుంది. వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ఏకంగా శాసన సభా పక్షాలను విలీనం చేసి, ప్రతిపక్షం లేకుండా చేసింది.
Also Read : జగన్‍కు మరో సవాల్.. ఈసారైనా..!
అప్పుడేమి.. వారితో రాజీనామా చేయించి బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. అలాంటిది.. ఆ విషయాన్ని అప్పుడు మంత్రిగా ఉన్న ఇప్పటి మాజీ మంత్రి కెటిఆర్.. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యం అనే మాట మాట్లాడుతూ ఓ సవాల్ చేసారు. బీఆర్ఎస్ కార్యకర్తల కృషితో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన ఎమ్మెల్యేలు లాలూచీ పడ్డారని, ఉప ఎన్నికలకు వెళ్ళాలి అంటూ ఆయన సవాల్ చేసారు.
Also Read : క్రికెటర్లను అవమానిస్తోన్న బోర్డు.. ఎందుకీ వైఖరి..?
చరిత్ర చూస్తే.. గతంలో బీఆర్ఎస్ కు వెళ్ళిన ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. వారి వారి పార్టీల కృషితో గెలిచిన ఎమ్మెల్యేలే వారు. ప్రభుత్వంపై పోరాటం చేయడానికే వారిని ప్రజలు ఎన్నుకుంది. మరి అలాంటి వారిని ఎందుకు రాజీనామా చేయించలేదు అనే ప్రశ్న కెటిఆర్ కు వినపడుతోంది. ఈ మధ్య కాలంలో కెటిఆర్ లో ఆగ్రహం ఎక్కువైంది. రాజకీయంగా ఎదురు అవుతున్న పరిస్థితులతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న మాటలను కామెడి అంటూ రాజకీయ విమర్శకులు సెటైర్ లు వేస్తున్నారు.