తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వాల్లో దూకుడు ప్రదర్శించింది. క్షేత్ర స్థాయి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. గతంలో కంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యువత ఎక్కువగా పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతం అయినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇక మంత్రులు, నాయకులు, స్థానిక క్యాడర్ అందరూ ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకోవడం, ఎవరికి వారు టార్గెట్ లు పెట్టుకుని పని చేయడంతో కొన్ని నియోజకవర్గాల్లో రికార్డులు బద్దలు కొట్టింది సభ్యత్వ నమోదు కార్యక్రమం.
Also Read : భయపడుతున్న జనసేన..? పవన్ భద్రతపై ఆందోళన…!
ఈ క్రమంలోనే విజయనగరం పార్లమెంట్ పరిధిలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజపతి నగరం నియోజకవర్గంలో.. సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. 70 వేలకు పైగా సభ్యత్వాలు ఈ నియోజకవర్గంలో నమోదు అయ్యాయి. పార్లమెంట్ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు చేసిన నియోజకవర్గంగా నిలిచింది గజపతి నగరం నియోజకవర్గం. ఈ విషయంలో మంత్రి చొరవ ఆకట్టుకుంది. స్థానిక నాయకత్వంతో నేరుగా మంత్రి మాట్లాడటంతో నియోజకవర్గ నేతలు కూడా ఉత్సాహంగా పని చేసారు.
Also Read : తిరుపతి అన్నప్రసాదంలో కీలక మార్పులు…!
మండల గ్రామ స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు చర్చించడం, నియోజకవర్గంలో పర్యటనలు చేయడంతో.. కార్యకర్తలు కూడా రెట్టింపు ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో వృద్దుల నుంచి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. నియోజకవర్గంలో మంత్రిని ముందు వ్యతిరేకించిన వారు కూడా ఆ తర్వాత సభ్యత్వ నమోదులో తమ వంతు కృషి చేసారు. అయితే ఈ విషయాన్ని ప్రచారం చేసుకునే విషయంలో మంత్రి వెనుకబడ్డారనే ఆరోపణలు వినపడుతున్నాయి.