తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణపై వేటు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తొలి నుంచి అంతా మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషను తప్పు తేల్చారు టీడీపీ నేతలు. కానీ పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత తెర వెనుక సూత్రధారులు, పాత్రధారుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ కొనకళ్ల నారాయణ బ్రదర్స్ అని ఇప్పటికే దర్యాప్తు తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అందించగా… ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read : నానీని కాపాడుతుంది ఎవరూ…? తిట్టినా పౌరుషం రాదెం…?
వాస్తవానికి నూజివీడు కార్యక్రమంపై మొదట్లో అంతా మంత్రి కొలుసు పార్థసారధిపై అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో వైసీపీలో కొనసాగినప్పుడు జోగి రమేష్‌తో ఉన్న సంబంధాల కారణంగా… ఆయనను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని అంతా భావించారు. అయితే ఈ ఘటనపై మంత్రి పార్థసారధి స్వయంగా వివరణ ఇచ్చారు. తనకు చివరి వరకు జోగి రమేష్ వస్తున్నట్లు తెలియదని… పైగా ఏడాదిన్నరగా వైసీపీకి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని స్వయంగా చంద్రబాబును కలిసి క్షమాపణ కూడా చెప్పారు. తన పాత్ర ఉన్నట్లు తేలితే ఎలాంటి చర్యకైనా సిద్ధమని కూడా వెల్లడించారు. దీంతో అసలు సూత్రధారులు ఎవరనే విషయంపై లోతైన దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిసింది.
Also Read : సీజ్ ది షిప్… కుదరదుగా గురూ
వేదికపై మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు గతంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన ఆరేపల్లి రాంబాబు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి దహనం చేసిన కేసులో ముద్దాయి అనగాని రవితో పాటు వైసీపీ కార్యకర్త బెజవాడ హర్ష కూడా పాల్గొన్నట్లు గుర్తించారు. గతంలో జనసేన జెండాపై బెజవాడ హర్ష మూత్రం పోసిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పవన్ కల్యాణ్ సహా జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అలాంటి వారిని వేదికపైకి ఎలా ఆహ్వానించారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ కార్యక్రమానికి ముందు నూజివీడులోని ఓ వైసీపీ నేత ఇంట్లో కొనకళ్ల బ్రదర్స్ సమావేశమయ్యారని… అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ కూడా చంద్రబాబుకు అందించారు టీడీపీ నేతలు. దీంతో ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో కొనకళ్ల వేటు ఖాయమనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత చర్యలుంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.