Friday, September 12, 2025 04:55 PM
Friday, September 12, 2025 04:55 PM
roots

స్వపక్షంలో విపక్షం.. సీఎంపై ఫైర్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వేరు కుంపట్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు నేతలు ఇప్పటికే పార్టీ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు పదవులు రాని నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. ఆ తర్వాత వీ హనుమంతరావు, మల్ రెడ్డి రంగారెడ్డి.. ఇప్పుడు మరో సీనియర్ కూడా వీరికి తోడయ్యారు. పదేళ్లు పూర్తిగా ప్రతిపక్షంలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ఢిల్లీ పెద్దల సూచనల మేరకు కొందరిని మాత్రమే పదవులు వరించాయి. దీంతో పదవి రాలేదనే అక్కసుతో కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు.

Also Read : పాపం ఆయన సంగతేంటి..? మాజీ సీఎం ఎదురు చూపులు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో పర్యటించిన సమయంలో పదేళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలకు మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం మేరకే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది నిర్ణయం జరుగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను నిఖార్సయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సహకరించరని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాన్ని ఎవరూ సహించరని కూడా అన్నారు.

Also Read : ఆ రెండు పదవులిస్తే ఉంటా.. లేదంటే అంతే..!

వాస్తవానికి కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే మంత్రిపదవిపైన రాజగోపాల్ రెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు. తనకు పదవి వస్తుందని తన అనుచరులతో పదే పదే చెప్పారు కూడా. సీనియర్ కోటాలో ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు కూడా. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డికి మంత్రిపదవి ఇచ్చింది. దీంతో రాజగోపాల్ కొంత అసహనం వ్యక్తం చేశారు కూడా. ఇక నెల రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ మార్పులో కూడా తనకు పదవి వస్తుందని ఆశ పడ్డారు. కానీ ఆ ఛాన్స్ రాలేదు. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి నోటీ దూల ఎక్కువ అనే మాట కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పని చేసిన రాజగోపాల్… 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసిన గెలిచారు. అయితే అనూహ్యంగా 2022 ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికే 2023 అక్టోబర్ 27 తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి తనకు మంత్రిపదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ అవకాశం మాత్రం రాలేదు. దీంతో తీవ్ర అసహనంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పైనే విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్