వక్రభాష్యాలు, అసత్యాలు, అబద్దాలు చెప్పడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీలు చేశారని, జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకోవాలి, తెలుగు వారి అభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశ్యంతో ఎన్ఆర్‌ఐలు ఎన్నికల సమయంలో వచ్చి పని చేయాలన్న నా వ్యాఖ్యలను వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా వక్రీకరిస్తుందని ఎన్ఆర్ఐ టిడిపి కోఆర్డినేటర్ కోమటి జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐలు ఎన్నికల్లో వచ్చి పని చేయడం నేరమా? తమ కుటుంబం కోసం నెలకు రెండు మూడు లక్షల రూపాయలు సంపాదించుకునే ఎన్ఆర్‌ఐలు వాటిని సైతం రాష్ట్రం కోసం వదులుకొని వచ్చారనడం తప్పా? నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో చేస్తున్న అసత్య, దుష్ప్రాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
ఎన్ఆర్ఐలు టిడిపి కి మద్ధతు ఇవ్వడం అనేది దేశద్రోహమా? ఎన్ఆర్ఐల్లో అయోమయ్యాన్ని అభద్రత భావాన్ని సృష్టించేందుకే ఇటువంటి అసత్య ప్రచారాలకి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రవాసాంధ్రుల సమస్యలను తీర్చేందుకు కృషి చేసింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు విదేశాల్లో ఉన్నారంటే అందుకు కారణం చంద్రబాబు మాత్రమే. అలాంటి మంచి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేసిందే కాకుండా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చి దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా ఎన్ఆర్ఐలు పని చేయడం వైసీపీ తట్టుకోలేకపోతుంది.
ఎన్ఆర్ఐలను టెర్రరిస్టుల్లా వైసీపీ క్రియేట్ చేస్తుందని, రాష్ట్ర హితం కోసం, తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్నికల్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం తమ బాధ్యతగా ప్రవాసాంధ్రులు భావిస్తున్నారని, అందుకోసం ఎన్నికల సమయంలో సొంత రాష్ట్రానికి వచ్చి ప్రజలకి చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగే మంచిని వివరించి టిడిపి కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తారని స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలపై మీరు చేస్తున్న కుట్రలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపకపోతే ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.