Thursday, October 23, 2025 07:34 PM
Thursday, October 23, 2025 07:34 PM
roots

కొలికపూడి వర్సెస్ కేసినేని.. అధిష్టానం సీరియస్.. మంగళగిరిలోనే పంచాయితీ..!

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీ వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తిరువూరు నియోజకవర్గంలో ఇచ్చిన పదవులకు సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. నామినేటెడ్ పోస్ట్ లతో పాటుగా పార్టీ పదవుల విషయంలో కూడా చిన్ని వర్గానికే వచ్చాయి.. ముందు నుంచి టీడీపీలో కష్టపడిన వారికి పదవులు ఇవ్వలేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.

Also Read : లక్షయ్య నాయుడుకి చేసిన న్యాయమే భవిష్యత్తులో అందరికీ చేస్తారా

ఇదే క్రమంలో తిరువూరులో కేసినేని చిన్నీ.. పీఏ కిషోర్.. దందాలు చేస్తున్నారు, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇక తాజాగా మరోసారి ఈ అంశంలో కొలికపూడి బాంబు పేల్చారు. వాట్సాప్ లో స్టేటస్ గా.. కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ లను కొలికపూడి పోస్ట్ చేసారు. తిరువూరు టికెట్ కోసం చిన్న రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, 2024 ఫిబ్రవరి నెలలో 3 విడతలుగా రూ.60 లక్షలు ఇచ్చాను అంటూ పోస్ట్ చేసారు. మరో రూ.50 లక్షలు చిన్ని పీఏ మోహన్ వచ్చి తీసుకెళ్లాడని పేర్కొన్నారు.

మిగతా మూడున్నర కోట్ల లావాదేవీపై రేపు చెబుతా అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలని స్టేటస్ పెట్టారు కొలికపూడి. ఇక దీనిపై కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. విజయవాడ ఉత్సవ్ ను జేబులో డబ్బులు ఖర్చు చేసి నిర్వహించాను అని, గత నాలుగేళ్ళుగా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసానని కామెంట్ చేసారు. అలాంటి తాను 5 లక్షలు పది లక్షలు తీసుకుంటానా అంటూ మండిపడ్డారు. నేను డబ్బుకు ఆశపడే వాడిని కాను అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

Also Read : త్వరలో మంత్రివర్గంలో భారీ మార్పులు..!

నేను కోవర్టులకు పదవులు ఇవ్వనని, నేను డబ్బుకు పదవులు ఇచ్చేవాడిని కాను.. ఎవరు ఎవరిపంచన చేరారో అందరికీ తెలుసని మండిపడ్డారు. నాపై ఆరోపణలను ప్రజలు ఎప్పుడూ నమ్మరు.. ఎంపీ లేకపోతే నేను లేనని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వెంటనే ఇద్దరూ పార్టీ ఆఫీస్ కు రావాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. దీనితో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

పోల్స్