బస్తీ మే సవాల్.. రారా సూసుకుందామూ.. నీ పెతాపము.. నా పెతాపమూ.. అంటూ సీమ యాసలో సమరసింహారెడ్డి సినిమాలో జయప్రకాశ్ రెడ్డి చెప్పిన అందరికీ గుర్తే కదా.. ఇప్పుడు ఇదే డైలాగ్ ఏస్తున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. 48 గంటల్లో రాజీనామా చేస్తా అని కూడా అల్టిమేటం జారీ చేశారు. అసలు ఈ సవాళ్లు ఏమిటీ… రాజీనామా గోలేంటీ.. అంటే.. చేసే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఏవో పాత విషయాలు వెలికి తీస్తున్నారు ఇప్పుడు. పైగా ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాస్తే చాలు.. వారంతా దొంగలు… ఆయన మాత్రమే సుద్దపూస అన్నట్లుగా ఎదురుదాడి చేస్తున్నారు కొలికిపూడి. ఎవరైనా సరే.. తమపై ఆరోపణలు వస్తే.. ముందు వాటిని ఖండిస్తారు.. తర్వాత వాటితో తమకు సంబంధం ఉందో లేదో రుజువు చేసుకుంటారు. కానీ కొలికిపూడి కథ మాత్రం వేరు.
Also Read : 30 ఏళ్ల తర్వాత చర్చ.. రియల్ విజనరీ..!
ఇప్పుడు వచ్చిన ఆరోపణకు పాత కథ లింక్ చేస్తారు. ప్రస్తుత విషయం తర్వాత.. ముందు పాత సంగతి తేల్చండి అంటూ తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేశారు. ఒక గిరిజన మహిళపై రమేష్ రెడ్డి లైంగిక వేధింపుల ఆడియో కలకలం రేపుతోంది. వాస్తవానికి ఈ వివాదం పాతది. దీనిపై పార్టీ పెద్దలు కూడా ఇప్పటికే దృష్టి సారించారు. అయితే దీనిపై ఇప్పుడే ఎందుకు కొలికిపూడి మాట్లాడుతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని.. మహిళలంతా కలిసి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేపట్టారు.
Also Read: బాబు మంత్రివర్గం లోకి ఎవరు ఇన్.. ఎవరు ఔట్..?
అయితే ఈ విషయంపై మాట్లాడాల్సిన కొలికిపూడి… విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. రమేష్ రెడ్డి వ్యవహారాన్ని 10 రోజుల క్రితమే పార్టీ పెద్దల దృష్టికి ఫిర్యాదు చేశనన్నారు. నిర్ణయం ఎందుకు తీసుకోలేదో తెలియటం లేదంటూనే… ఇక్కడ మరోసారి కులం కార్డు వాడారు. అదే సమయంలో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఛాలెంజ్ విసిరారు కొలికిపూడి. తనపై వస్తున్న ఆరోపణల మీద బహిరంగ డిబేట్‌కు సిద్దమన్నారు. తేదీ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.. ఏనీ టైమ్.. సింగిల్ హ్యాండ్.. గణేష్.. అనే డైలాగ్ మాదిరిగా డిబేట్‌కు రెడీ అంటూ సవాల్ చేశారు.
Also Read : పోలవరంపై చంద్రబాబు కీలక ప్రకటన
న్యాయం చేయలని బాధితులు డిమాండ్ చేస్తుంటే.. కొలికిపూడి మాత్రం.. అసలు విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. రమేష్ రెడ్డికి ఎంపీ ఆఫీసులో సపోర్టు ఉంది… ఒకరికి ట్రాక్టర్లు, డబ్బులు లంచం ఇచ్చాడు.. బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా నేను ఎందుకు.. అసలు నా గురించి ఏ ఒక్కరైనా సరే తిరువూరులో వ్యతిరేకంగా మాట్లాడగలరా.. నాపైన ,తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కొలికిపూడి వితండ వాదన చేస్తున్నారు. పైగా రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తా అంటూ బెదిరిస్తున్నారు కూడా.
Also Read : నాగబాబుకు ఇచ్చే శాఖలు ఇవేనా..?
వాస్తవానికి కొలికిపూడి శ్రీనివాస్ పై ఆరోపణలు కొత్తేమి కాదు. ఇటీవల వైసీపీ నేతలతో కలిసి మైనింగ్ మాఫియా నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపించాయి. ఏ.కొండూరులో రెండు రోజుల క్రితమే వైసీపీ నేతకు చెందిన మూడు గ్రావెల్ లారీలను పట్టుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఆ పట్టుకున్న లారీలను విడిపించేందుకు ఎమ్మెల్యే కొలికిపడి నానా పాట్లు పడ్డాడు. అయితే సీఐ ససేమిరా అనటంతో.. చేసేది లేక… మిగిలిన లారీలను ఎందుకు పట్టుకోలేదంటూ ఊరు జనాల ముందు గోల గోల చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం బాధితులకు న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలంటూ బేల పలుకులు పలుకుతున్నారు. ఎంపీ ఆఫీసులోనే ఉంటున్న రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే.. 48 గంటల్లో రాజీనామా చేస్తానంటూ సవాల్ చేస్తున్నారు.