Saturday, September 13, 2025 02:52 AM
Saturday, September 13, 2025 02:52 AM
roots

కొడాలి నాని గుండెకు ఏమైందంటే..!

మాజీ మంత్రి కొడాలి నానీ ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల నుంచి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఆయనకు గుండెపోటు వచ్చిందనే ప్రకటనతో రాజకీయ వర్గాలు కంగు తిన్నాయి. అయితే ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక కొడాలి నానీకి ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహించారు అధికారులు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీలో చేరారు నానీ. గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.

Also Read : వణికిస్తున్న లావు.. వైసీపీలో అలజడి

మూడు వాల్వులు బ్లాక్‌ అయినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఆపరేషన్‌ చేయాలని తేల్చిన వైద్యులు.. ఎప్పుడు చేస్తారనే దానిపై మాత్రం ఇంకా ఏ ప్రకటన లేదు. ఇక డాక్టర్లతో మాట్లాడిన వైఎస్ జగన్.. మెరుగైన వైద్యం అందించాలని కోరినట్టు వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక కార్యకర్తలు ఆందోళన చెందుతారని ఆపరేషన్ విషయాన్ని గుడివాడ వైసీపి నేత దుక్కిపాటి శశిభూషన్ బయట పెట్టలేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. వైఎస్ జగన్ డాక్టర్లతో మాట్లాడాకే ఆపరేషన్ సంగతి తెలిసిందని దుక్కిపాటి మీడియాకు వెల్లడించారు.

Also Read : 30 ఏళ్ల తర్వాత చర్చ.. రియల్ విజనరీ..!

కొడాలి నాని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. నేడు ఏఐజి నుంచి నానీ డిశ్చార్జ్ కానున్నట్టు తెలుస్తోంది. కొడాలి నాని కి నిర్వహించిన హెల్త్ టెస్టుల్లో గుండె కవాటాల్లో క్లాట్లు ఉన్నట్లు గుర్తించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. క్లాట్లకు సంబంధించి అంత అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పగా.. స్టంట్ లు వేయడమా, బైపాస్ సర్జరీ చేయడమా అనేదానికి సంబంధించి ఇంకా కొడాలి నాని నిర్ణయించుకోలేదు. సెకండ్ ఒపీనియన్ కోసం ఇతర హాస్పిటల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. సెకండ్ ఒపీనియన్ తరువాత ఉగాది తరువాత పూర్తిస్థాయి చికిత్స చేయించుకునే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్