Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

గాలి లెక్కలు కాదు.. మరోసారి కేకే లెక్క పక్కా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత కేకే సర్వే పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. కిరణ్ చెప్పిన సర్వే వందకు వంద శాతం నిజం కావడంతో… అతని సర్వేలపై జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం అయిన కిరణ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున సర్వేలు చేస్తూ… ఎన్నికల ఫలితాలపై తన లెక్కలను బయటపెడుతున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆయన అంచనా నిజమైనా… హర్యానా ఎన్నికల్లో మాత్రం బోల్తా పడ్డారు.

Also Read : వీరు పార్టీ మారడం వెనుక ఇంత స్వార్ధం ఉందా?

కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఆయన తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నారు. ఏ సర్వే సంస్థ ఇవ్వని విధంగా మహారాష్ట్రలో 225 స్థానాల్లో మహాయుతి కూటమి గెలుస్తుందని కేకే సంచలన ప్రకటన చేసి ఓ సవాల్ కూడా చేసారు. తన మాటలను రాసిపెట్టుకోండి అంటూ ఆయన సవాల్ చేసారు. మహారాష్ట్ర ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించిన సంస్థల్లో కొన్ని గరిష్టంగా మహాయుతి కూటమికి 180 నుంచి 190 స్థానాలు ఇస్తే కేకే మాత్రం 225 స్థానాలు అంటూ చాలా ధీమాగా చెప్పారు. మహాయుతి కూటమి 220 స్థానాలకు పైగా ఆధిక్యంలోకి వచ్చింది.

Also Read : జగన్ ను అడ్డంగా ఇరికించిన పేర్ని నాని

దీనితో మరోసారి కేకే సర్వే నిజమైంది. ఆయన గాలి లెక్కలు చెప్తారు అంటూ కొందరు పదే పదే విమర్శలు చేస్తూ వచ్చినా ఇప్పుడు పక్కా లెక్కలతో ఆయన సర్వే నిజమైంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే… ఎవరూ ఊహించని ఫిగర్ చెప్పారు. జనసేన పార్టీ ఖచ్చితంగా 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. ఏ సర్వే సంస్థ అలా ఇవ్వలేదు. దీనితో మరోసారి కేకే సర్వే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన సర్వేలపై ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్