Wednesday, February 4, 2026 01:09 PM
Wednesday, February 4, 2026 01:09 PM

బిజెపి మునిగిపోతున్న టైటానిక్.. కిరణ్ కొండేటి సంచలన రిపోర్ట్

“బీజేపీ ఒక టైటానిక్ షిప్”.. ఈ మాటకు అర్ధం ఏంటో అర్ధం అయ్యే ఉంటుంది కదా…? టైటానిక్ మునిగిపోవడానికి ముందు చాలా పెద్ద నౌక. అలాగే బిజెపి కూడా… మునిగిపోయే ముందు చాలా పెద్దగా కనపడుతుంది. ఇండియా మ్యాప్ మీద టార్గెట్ పెట్టుకుని కాషాయ జెండాలు పాతిన బిజెపి పెద్దలు… ఇప్పుడు బిజెపిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా కేకే రిపోర్ట్ బయట పెట్టిన సంచలన విషయాలు చూస్తే ఇక బిజెపి ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో 2 ఓడిపోతుందని చెప్తూ… 5 రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడిపోతుందనే విషయాన్ని వెల్లడించారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలలో బిజెపి ఓటమి ఖాయం అని స్పష్టం చేసారు. హర్యానా ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేక ఓటు న్యూట్రల్స్ లో ఎక్కువగా ఉందని, అది కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని చెప్పారు ఆయన. వేరే పార్టీలు పోటీ చేస్తున్నా కూడా కాంగ్రెస్ కె బలం చేకూర్చే అవకాశం ఉందని స్పష్టం చేసారు. హర్యానాలోనే కాకుండా మహారాష్ట్ర, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డియే కూటమి ఓడిపోవడం ఖాయమని చెప్పారు కిరణ్.

Read Also : జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక మలుపు

ఢిల్లీలో బిజెపికి అనుకూల వాతావరణం అయితే కనపడటం లేదని స్పష్టం చేసారు. గత పదేళ్ళలో బిజెపి ఏం అనుకుంటే అది జరిగింది. సంఘ్ పరివార్ ను కూడా గ్రిప్ లో పెట్టుకుని రాజకీయం చేసింది. కాని వ్యతిరేక పవనాలు 2024 ఎన్నికల నుంచే మొదలైనా కూటమి పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేంద్రంలో గేమ్ మొదలయ్యే అవకాశం ఉండవచ్చు. పైకి కనపడటం లేదు గాని బిజెపిలో ఆందోళన స్పష్టంగా అర్ధమవుతోంది.

గతంలో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి బిల్లుని చాలా వేగంగా ప్రవేశ పెట్టిన బిజెపి ఇప్పుడు చిన్న బిల్ సభలో ప్రవేశ పెట్టాలన్నా సరే భయపడే పరిస్థితికి వచ్చేసిన మాట వాస్తవం. జమిలీ ఎన్నికల ప్రస్తావన కూడా వ్యూహాత్మకంగానే తీసుకొచ్చింది బిజెపి. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఎంతో కొంత లాభం అని బిజెపి భావిస్తోంది. విడివిడిగా ఎన్నికలు జరిగితే తనకు ఇతర పార్టీల నుంచి ప్రమాదం పొంచి ఉందని బిజెపి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే ఇప్పుడు జమిలీ ఎన్నికల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. టీడీపీ సహా పలు కీలక ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునే వ్యూహం ఇదే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్