Friday, September 12, 2025 09:19 PM
Friday, September 12, 2025 09:19 PM
roots

టార్గెట్ వర్రా కాదా…? అసలు ఏం జరుగుతోంది…?

వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి కోసం నాలుగు రోజుల నుంచి గాలించిన పోలీసులు ఎట్టకేలకు నిన్న అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. మహబూబ్ నగర్ లో అరెస్ట్ చేసిన వర్ర రవీంద్రారెడ్డిని నిన్న అర్ధరాత్రి కర్నూలు డిటిసిగా తీసుకువచ్చిన పోలీసులు… ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మంగళగిరి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే అతనిపై రాజంపేటలో పలు కేసులు నమోదు అయ్యాయి. దీనితో అక్కడికి తీసుకు వెళ్ళే ఛాన్స్ ఉంది.

Also Read : టార్గెట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా మృగాల వేట మొదలైంది

వైసీపీ నాయకులకి బలం ఉన్న నేపథ్యంలో రాజంపేటలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీనితో మంగళగిరి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఎంపీ అవినాష్‌ పీఏ రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లి అతని కోసం ఆరా తీసారు. ప్రస్తుతం అందుబాటులో లేని రాఘవ, ఎక్కడ ఉన్నాడు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కుటుంబ సభ్యులు. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన… వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్టు గుర్తించారు.

Also Read : వైసీపీలో ఆ సీనియర్ నేత పరిస్థితి ఏమిటో..?

రాఘవ తండ్రితో మాట్లాడిన పులివెందుల పోలీసులు… పలు కీలక విషయాలను ఆరా తీసారు. రాఘవ వచ్చిన తర్వాత సమాచారమిస్తానని అతని తరుపు లాయర్ చెప్పడంతో అక్కడి నుంచి పోలీసులు వెనక్కు వెళ్ళారు. రాఘవను పోలీసులు అరెస్ట్ చేయవచ్చని వార్తలు రావడంతో ఏ కేసులో అనేది క్లారిటీ ఇవ్వలేదు. రాఘవ వద్ద వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కీలక సమాచారం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనితోనే అతన్ని అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో నిజానిజాల పై పోలీసులు అని క్లారిటీ ఇవ్వాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్