అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతున్న భారత రాష్ట్ర సమితి.. ఇప్పుడు కేసులతో కూడా కంగారు పడే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపింది. ఆ తర్వాత అనూహ్యంగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా వాతావరణం వేడిగానే ఉన్న సమయంలో.. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం బయటకు వచ్చింది.
Also Read : హడావుడిగా సచివాలయానికి లోకేష్.. కారణం ఇదే
దాదాపు మూడు నాలుగు నెలల నుంచి దీనిపై ఎన్నో చర్చలు జరిగాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఏసీబీ విచారణ పూర్తి చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో.. క్విడ్ ప్రో కో కోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ తన 9 నెలల దర్యాప్తులో తేల్చింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ కి 75.88 కోట్ల రూపాయల నష్టం వాటిలినట్లు తేల్చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థ 46 కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు ఏసీబీ తన విచారణలో గుర్తించింది.క్విడ్ ప్రో కో లో భాగంగా 44 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లు భారత రాష్ట్ర సమితికి అందినట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు.
Also Read : చిరంజీవితో మరోసారి శర్వానంద్ ఢీ..!
దీనితోనే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటుగా ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ఓ లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందింది. నేడు దీనిని విజిలెన్స్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. అనంతరం గవర్నర్ అనుమతికి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ అనుమతిస్తే అరెస్టు గాని లేదంటే చార్జిషీట్ గాని దాఖలు చేసే అవకాశాలున్నాయి. రాబోయే మూడు నాలుగు రోజుల్లో దీనిపై కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం.