Saturday, September 13, 2025 09:12 AM
Saturday, September 13, 2025 09:12 AM
roots

బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ పర్యాయం ఆసక్తిగా మారుతున్నాయి. బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవడం ఒకటి అయితే… సోషల్ మీడియా వైసీపీ ఉన్మాదులను అరెస్ట్ చేయడం, శాంతి భద్రతల అంశం, సర్వస్వతి పవర్ భూముల వ్యవహారం ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా బయట పెడుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ఓ బిల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

Also Read : పోలీసుల ఉచ్చులో సజ్జల

దీనిపై కొత్త చట్టం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. అసెంబ్లీ ఈ సెషన్ లో కీల‌క బిల్లులు ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన పలు ప్రతిపాదన లపై బిల్లులను ప్రవేశ పెట్టీ పాలకపక్షం ఆమోదం తెలపనుంది. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క చ‌ట్టం 1982 బిల్లు రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. దానిస్థానంలో ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క బిల్లు 2024 ను ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న చట్టం అక్రమార్కులకు అనుకూలంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : కేసీఆర్‌ను కలవరపెడుతున్న మరో అంశం…!

దేవాల‌యాల పాల‌క మండ‌లాల్లో ప్ర‌స్తుతం ఉన్న వారికి ఆద‌నంగా మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు నియామ‌కం పై బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జ్యూడిషియ‌ల్ క‌మీష‌న్ ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. జ్యూడిషియ‌ల్ అధికారుల ఉద్యోగ ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌స్సు 60 ఏళ్ల నుండి 61 ఏళ్ల కు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుంది సర్కార్. గత ప్ర‌భుత్వ మద్యం దుకాణాల‌ను రద్దు చేస్తూ తీసుకువ‌చ్చిన ఆర్ఢినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెడుతుంది సర్కార్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్