Friday, September 12, 2025 05:11 PM
Friday, September 12, 2025 05:11 PM
roots

రేవంత్ కి రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడొస్తున్నారు? ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో ప్రజా సమస్యలపై గళం విప్పుతారా? ప్రభుత్వ వైఫల్యాలపై ఫాంహౌస్‌లో ఆయన వ్యూహరచన చేస్తున్నారా? త్వరలో ఫాంహౌస్ నుంచి బయటకు రాబోతున్నారా? తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నారా? బయటకు రావటం లేదంటోన్న రాజకీయ ప్రత్యర్థులకు కేసీఆర్ తన మార్క్ రాజకీయాన్ని చూపించబోతున్నారా? బీఆర్ఎస్ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది?

గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మే 13న‌ జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 17స్థానాలకు గాను.. కాంగ్రెస్, బీజేపీ ఎనిమిది సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. మరో స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది. సగం సీట్లలో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాల్లోకి రావటం లేదు. తన ఫాంహౌజ్‌కే కేసీఆర్ పరిమితమయ్యారు.

ప్రధాన ప్రతిపక్షనేతగా ప్రజా సమస్యలపై మాట్లాడకపోవటంతో కేసీఆర్ పై విమర్శలు వస్తున్నాయి. ‌ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవటం.. ప్రజాసమస్యలపై మాట్లాడకపోవటం.. ప్రజలు అనేక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నప్పటకీ కేసీఆర్ స్పందించడం లేదన్న కామెంట్స్ వి‌న్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు.. రైతు రుణమాఫీపై నిరసనలు జరుగుతున్నాయి. కీలకమైన రైతు రుణమాఫీపై ఇంతలా చర్చ జరుగుతున్నప్పటికీ.. మాజీ సీఎం హోదాలో కేసీఆర్ ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.

Also Read : వీరికి టీడీపీ పై ప్రేమా లేక హైడ్రా అంటే భయమా..?

హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలొచ్చాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినా కేసీఆర్ స్పందించలేదు‌. క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోయినా.. కనీసం ప్రజలకు భరోసా ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి.

మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ క్రమంలో డిసెంబర్ వరకు రేవంత్ రెడ్డి సర్కార్‌కు సమయం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఎన్నికల హామీల అమలుకు కనీసం ఏడాది సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించారట. ఇందులో భాగంగా డిసెంబర్ 7తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.

ఇందులో భాగంగా‌ తన ఫాంహౌస్‌లో రూట్ మ్యాప్‌ను కేసీఆర్ సిద్ధం చేసుకుంటున్నారట. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ స్టడీ చేస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారానికి డిసెంబర్ తర్వాత కేసీఆర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనవరిలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరిగే అవకాశముంది. ఈలోపు ప్రజా సమస్యలపై గళం విప్పి.. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం.

పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు.? ఉద్యోగ వర్గాలు ఏమనుకుంటున్నాయి.. నిరుద్యోగ యువత, విద్యారంగం సహా.. వివిధ అంశాలపై ఆరా తీస్తున్నారట. ఇదే సమయంలో బీఆర్ఎస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది.. పార్టీలో యాక్టీవ్ గా పనిచేస్తున్న నేతల వివరాలను సైతం కేసీఆర్ తెలుసుకుంటున్నారట.

అటు.. రైతు రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణపై ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయంపై కూడా కేసీఆర్ స్టడీ చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కూడా పార్టీ నేతలతో కేసీఆర్చర్చిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఆరా తీస్తూనే నేతలకు తగిన సూచనలు ఇస్తున్నట్లు తెలిసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజల మూడ్‌ను బట్టి ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారట. ఇదే సమయంలో పార్టీ బలోపేతంపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.

డీఎంకే, తెలుగుదేశం లాంటి పార్టీల మాదిరి బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారట. ఇందులో భాగంగా గ్రామస్థాయి మొదలుకొని.. మండల, నియోజకవర్గం, జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలు త్వరలోనే వేయనున్నట్లు గులాబీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. పార్టీని బలోపేతం చేసిన తర్వాత క్యాడర్‌కు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారట. ఇక.. కేటీఆర్, హరీష్ రావు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ సైతం బయటకు వస్తే బీఆర్ఎస్‌లో మరింత ఉత్సాహం వస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి..

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్