ఆంధ్రప్రదేశ్ లో గత పదేళ్లుగా ఓ తరహా రాజకీయం ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. ప్రభుత్వాలను బలహీనపరచడానికి రాజకీయ పరమైన విమర్శలు… క్రైం మార్గంలో చేసేందుకు ఏపీలో వైసీపీ కొందరిపై దాడులకు దిగేది అనే ఆరోపణలు ఉండేవి. అలాగే కొందరిని అడ్డుతొలగించుకుని తెలుగుదేశం పై నెడుతున్నారు అనే ఆరోపణలు కూడా పదే పదే వస్తూ ఉండేవి. దీనికి సంబంధించి టీడీపీ ఎన్ని విధాలుగా ఖండించే ప్రయత్నం చేసినా సరే.. అది మాత్రం కంట్రోల్ లోకి వచ్చిన పరిస్థితి చాలా తక్కువ. ప్రజలు కూడా వాటిని నమ్మేవారు. ఇదే పద్దతిని ఫాలో అయ్యి జగన్ అధికారంలోకి కూడా వచ్చారు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ లో షేక్ అవుతున్న బీఆర్ఎస్
కృష్ణా నది విషయంలో, మద్యం విషయంలో, వైఎస్ వివేకా విషయంలో, అమరావతి విషయంలో, గోదావరి పుష్కరాల సమయంలో ఇలాంటివి చాలా జరిగేవి. ఇప్పుడు తెలంగాణాలో కూడా ఇదే తరహా రాజకీయం మొదలయింది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కోడంగల్ లో కలెక్టర్ పై దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంది అనే అనుమానాలు మొదలయ్యాయి. దీనితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ఆ ఇద్దరూ చేసిన పాపం ఏంటీ…?
లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా, సంభాషణలపై దర్యాప్తు వేగవంతం చేసారు. అక్కడ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన… కలెక్టర్ పై దాడి చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు అనే ఆరోపణలు వచ్చాయి. దీనితో ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి వైసీపీ తరహా రాజకీయం బీఆర్ఎస్ కూడా మొదలుపెట్టింది అనే ప్రచారం ఊపందుకుంది.