Sunday, March 22, 2026 07:45 AM
Sunday, March 22, 2026 07:45 AM

మొదటిసారి అమెరికాకు కేసీఆర్‌.. ఎందుకో తెలుసా..?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అగ్రరాజ్యం అమెరికా వెళ్ళబోతున్నారనే వార్త.. పొలిటిక్‌ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి అమెరికాకు ఎందుకు వెళ్తున్నట్లు? ఎవరి కోరిక మేరకు కేసీఆర్ యూఎస్‌లో పర్యటించబోతున్నారు? ఎన్నాళ్ళు అక్కడ ఉండబోతున్నారు? కేసీఆర్ అమెరికా టూర్ పై బీఆర్ఎస్‌లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ అమెరికా పర్యటనను ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు ధృవీకరించలేదు.

Also Read : టాలీవుడ్ రేవంత్ ను తక్కువ అంచనా వేసిందా..?

కేసీఆర్‌ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ కేసీఆర్ అమెరికాకు ప్రయాణమైతే.. ఆయన జీవితంలో మొదటిసారి అగ్రరాజ్యానికి వెళ్లినట్లు అవుతుంది. కేసీఆర్ అగ్రరాజ్యానికి వెళ్లడం ఇదే తొలిసారి. సుమారు 45ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కేసీఆర్‌ ఇప్పటివరకు మూడు దేశాల్లో మాత్రమే పర్యటించారు. దీంతో ఆయన అమెరికా పర్యటన వార్త.. హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణ మాజీ సీఎం రూటే సెపరేట్. స్వరాష్ట్రంలో ఉండాలనే కేసీఆర్ కోరుకుంటారు. దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నిలిచారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసినప్పటికీ.. ఆయన పర్యటించిన దేశాలు రెండు మాత్రమే. ముఖ్యమంత్రి అయిన కొత్తలో సింగపూర్, మలేసియా దేశాల్లో పర్యటించారు. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు అధికారులు, మంత్రులతో కలసి చైనాలో పర్యటించారు. ఈ పర్యటనలు మినహా.. కేసీఆర్ తన జీవితకాలంలో ఎన్నడూ మరోసారి దేశాన్ని వీడలేదు.

Also Read : వైసీపీలో వేరే లీడర్లే లేరా..? జగన్ పై క్యాడర్ ఫైర్..!

ఎన్నికల్లో ఓటమి తర్వాత అనారోగ్య కారణాలతో.. ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. రాజకీయ సమావేశాలు కూడా ఫామ్‌హౌస్‌లోనే నిర్వహిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ మనవడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అతడి కోరిక మేరకే కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే అమెరికాలో ఉన్న ఎన్నారైలతో సమావేశాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్