బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి నుంచి సొంతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరులస్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారని గుర్తుచేసుకున్న ఆమె వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలని కోరారు.
Also Read : దానం చుట్టూ మరో వివాదం..!
పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పామన్న ఆమె.. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పామని, కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేదన్నారు. ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటిసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయని, కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఇప్పటికి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఉద్యమం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్ కోసం తొందరపడుతున్నాడా?
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయిన సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగిన అని.. అప్పుడు అమరవీరుల కుటుంబాలాకు ఇంకో రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కానీ మీకోసం నేను ఇంకా ఎక్కువగా కొట్లాడేది ఉందన్నారు. అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నాను వ్యాఖ్యానించారు. తెలంగాణ యావత్ బాగుండాలనే అమరులు వారి ప్రాణాలను త్యాగం చేశారని, ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాని, ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా అంటూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు
ఉద్యకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్భార్ పెట్టుకొని తయారు చేద్దామని, ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా నేను పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నానని ప్రకటించారు. మీరు కూడా వచ్చేయండి. అందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందన్న ఆమె, ఆ హామీ నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిందేనని స్పష్టం చేసారు. ఉద్యమకారుల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చిందని, అందరం బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు.




