Sunday, March 22, 2026 01:49 AM
Sunday, March 22, 2026 01:49 AM

కార్తీక మాసం పోలి స్వర్గం కథ..

కార్తికమాసాంతంలో అందరికి గుర్తుకువచ్చే కథ ‘పోలి స్వర్గం’. తపన ఉంటే ఎలాంటి అవాంతరాలు ఎదురైన, ఎన్ని హింసలకు గురైన, సహనంతో తాను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, ధర్మాన్ని పాటించిన, భగవంతుడు వెన్నంటే ఉండి సహకరిస్తాడు అని, భగవంతుని కొలవడానికి కావాల్సింది శ్రద్దే కానీ ఆడంబరం కాదని పెద్దలు ఈ కథను ఉదంతంగా చెబుతారు.

అత్త అహం, ఈర్వా, అసూయలతో ఉండటం వల్ల స్వర్గ ప్రాప్తిని చేజిక్కించుకోలేక పోయింది. అందరికన్నా చిన్న కోడలైన పోలికి ఆ అదృష్టం దక్కింది. ఇంతకీ ఎవరీ పోలి? కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆమె వెనుక ఉన్న కథ తల్చుకుంటూ ఈ ఆచారం ఎందుకు చేయాలి?

Also Read : అంతా నా ఇష్టం అంటున్న జగన్

ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలు, వ్రతాలు అంటే మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీకమాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోపు చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అనే అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయటకు వెళ్లేది ఆ అత్తగారు.

అప్పుడామె నిస్సహాయ స్థితిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేస్తూ తన మనసులో ‘దీన రక్షణ! గోవిందా! జనార్ధనా! స్వామీ! నేనేమి చేయగలను. పవిత్ర నదీ స్నానం లేదు. స్పూర్తినిచ్చు దీపారాధన లేదు. మనసుకు ప్రశాంతత ఇచ్చే దైవ దర్శనం, పూజ, పురాణ శ్రవణం ఏవీ లేవు. నాకెటువంటి గతి కలుగునో కదా! నేనెంత దురదృష్టవంతురాలిని’ అని ఆమె పలు విధాలుగా విచారించారు. కార్తీకమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్త గారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు.

Also Read : గ్రాండ్‌గా అఖండ 2 ప్రీ రిలీజ్.. చీఫ్ గెస్ట్‌ ఎవరంటే..?

తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ ఆమె, తన పరిస్థితికి లోబడి, యింటిలో కుండలోనున్న నీటితో స్నానం చేసి, చినిగిన వస్త్రాన్ని ధరించిన ఆమె, తాను ధరించిన జీర్ణవస్త్రం అంచును చించి ఒత్తిగ చేసి, దానికొక పాత్రలో నుంచి కవ్వానికి ఉన్న కొద్దిపాటి వెన్నను తీసి, ఆ పాత్రలో ఉంచి, దీపాన్ని వెలిగించి, “స్వామీ! పుండరీకాక్షా! గోవిందా! జనార్ధనా! అనాధ రక్షకా! దయ జూపుము. నేనశక్తురాలను, నాపై అనుగ్రహం ఉంచుమని పోలి ప్రార్ధించింది.

కార్తీకమాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్త గారు బయల్దేరారు. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసి కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవ దూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ… అది చూసి.. తమ కోసమే వచ్చినట్లు మురిసి పోయారు.

Also Read : బ్యాంకు స్టేట్మెంట్ తో అడ్డంగా దొరికిన జోగి..?

కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. దేవ దూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెప్పడంతో వాళ్లు ఒక్కసారిగా హతాసులయ్యారు.

అత్తతో పాటు మిగిలిన వాళ్లు సంసారంలోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక. ఈ నేపథ్యంలో తెలుగింట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే ఆరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి.. టబ్బుల్లో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది.

Also Read : అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ కీలక సూచనలు..!

ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా. ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే.. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.

తెలుగు వారు ఇటు పోలిని, అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.

పోలి పాడ్యమి రోజున పగటి ఆహారం, ఉసిరి భుజించటం నిషిద్ధ. నువ్వులు, తర్పణాలు, ఉసిరి దానం చేస్తే మంచిది. సర్వ దేవతలతో పాటు పితృ దేవతలను పూజించాలి. ఓం అమృతాయ స్వాహా అనే మంత్రం జపించాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్