Monday, October 20, 2025 08:52 AM
Monday, October 20, 2025 08:52 AM
roots

కోహ్లీ, రోహిత్ పై బోర్డు రాజకీయాలు.. మాజీ క్రికెటర్ సంచలనం

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడం సంచలనం అయింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తారు అని భావించినా.. అనూహ్యంగా ఈ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. దీని వెనుక హెడ్ కోచ్ గంభీర్ ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. అతని రాజకీయాల కారణంగానే ఈ ఇద్దరూ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు అనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఒకరి తర్వాత ఒకరు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై అభిమానుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Also Read : ధోనీ తప్పించాడు.. సచిన్ అండగా నిలిచాడు..!

తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రి దీనిపై సంచలన కామెంట్స్ చేసాడు. విరాట్ కోహ్లీలో ఇంకా ఆడే సత్తా ఉందని.. అతను మరో రెండేళ్ళ పాటు క్రికెట్ ఆడతాడు అని.. కోహ్లీ టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి రావాలని వ్యాఖ్యానించాడు. కానీ అతను దురదృష్టవశాత్తు జట్టు నుంచి తప్పుకున్నాడని, దీని వెనుక ఖచ్చితంగా అంతర్గత రాజకీయాలు ఉన్నాయని.. చివరకు అంత గొప్ప ఆటగాడికి సరైన వీడ్కోలు కూడా పలకలేదు అని మండిపడ్డాడు. ఇప్పటికైనా అతనికి మంచి వీడ్కోలు పలకాలని కోరాడు.

Also Read : పొట్టి ఫార్మాట్ కెప్టెన్ గా గిల్..? షాక్ ఇచ్చిన బోర్డు..!

ఈ రాజకీయాలను అర్ధం చేసుకోవడం కష్టమన్నాడు. బోర్డు, సెలెక్టర్ లు ఏం ఆలోచిస్తున్నారో కూడా అర్ధం కాదని కామెంట్ చేసాడు. దీనితో పాటు, వీరిద్దరూ త్వరలో వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోవచ్చని, 2027లో ప్రపంచ కప్ ఆడకపోవచ్చు అని అభిప్రాయపడ్డాడు. వాళ్ళు ఇద్దరూ టెస్ట్ క్రికెట్ తో పాటుగా పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్