బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన నేపధ్యంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల నిర్వహణపై విమర్శలు ఎదుర్కొంటున్న కర్ణాటక ప్రభుత్వం, కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. కర్ణాటక సర్కార్ జనసమూహ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది.
Also Read : తెలంగాణాలో షేక్ ఆడిస్తున్న ఏసీబీ.. ఆరు నెలల్లో ఎన్ని కేసులంటే..?
దీని ద్వారా బహిరంగ కార్యక్రమాలు, సామూహిక సమావేశ వేదికల వద్ద జనసమూహాన్ని నియంత్రించనున్నారు. దీని కోసం ప్రత్యేక బలగాలను కేటాయిస్తారు. అయితే ఈ చట్టం నుండి.. జాతర, రథోత్సవం, పల్లకి ఉత్సవం, తెప్పడ తేరు, ఉరుస్ లేదా ఏదైనా, కులం లేదా మతానికి సంబంధించిన ఏదైనా మతపరమైన కార్యక్రమాలను మినహాయించింది. జూన్ 19న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్ పై ప్రభుత్వం చర్చించింది. తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్ ఆమోదం కోసం రానుంది.
Also Read : క్యాచ్ కాదు మ్యాచ్ వదిలేసాడు.. జైస్వాల్ ముంచేసాడా..?
అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గానూ ప్రోటోకాల్‌లు, రిజర్వ్డ్ సీటింగ్, భద్రతా వ్యవస్థలు, యాక్సెస్ కంట్రోల్, సజావుగా ప్రజలను కంట్రోల్ చేయడానికి.. అధునాతన చెక్-ఇన్ వ్యవస్థను తీసుకు రానున్నారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలపై మార్గదర్శకాలను ముసాయిదా బిల్లులో పొందుపరుస్తారు. ప్రతి వేదిక యొక్క.. సామర్థ్యం, ప్రవేశ/నిష్క్రమణ మార్గాలు, అత్యవసర తరలింపు నిర్ణయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై స్వతంత్ర ఆడిట్‌లు ఉండాలి. భద్రతా ప్రమాణాలను పాటించని వేదికల వద్ద భారీ జన సమీకరణకు అనుమతించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో, స్థానిక పోలీస్ స్టేషన్ ఈవెంట్‌ను వాయిదా వేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు లేదా దాని వేదికను మార్చవచ్చు.