ఇండియన్ సినిమాలో సౌత్ సినిమాల డామినేషన్ కంటిన్యూ అవుతోంది. ఒక్కో సినిమా కలెక్షన్ లు బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా ఓ రేంజ్ లో హిట్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా భారీ కలెక్షన్ లు సాధిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా భారీ అంచనాలతో వచ్చిన కాంతారా చాప్టర్ 1 సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. మూడేళ్ళ క్రితం కాంతారా రిలీజ్ కాగా కాంతారా చాప్టర్ 1 ఈ నెల 2 న రిలీజ్ అయి భారీ వసూళ్ళ దిశగా వెళ్తోంది.
Also Read : చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
ఈ కన్నడ పీరియాడికల్ డ్రామా ఏడవ రోజున కూడా బాక్సాఫీస్ ను డామినేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ₹ 450 కోట్ల మార్కును దాటింది. కాంతార చాప్టర్ 1 బుధవారం థియేటర్లలో ఏడవ రోజు 25 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది . దేశీయంగా 316 కోట్ల రూపాయల షేర్ సాధించగా.. 379 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం హిందీ-డబ్బింగ్ వెర్షన్‌లో 100 కోట్ల నికర వసూళ్లను దాటింది. కన్నడ వెర్షన్ 99 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. తెలుగు వెర్షన్ కూడా ఇప్పటివరకు 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Also Read : అన్నాడిఎంకే తోనే టీవీకే.. పొత్తు ఫైనల్..?
అలాగే మలయాళం, తమిళ డబ్బింగ్‌లు కూడా ఒక్కొక్కటి 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీనితో కాంతార చాప్టర్ 1 నిజమైన పాన్-ఇండియా హిట్ గా నిలిచింది అనడానికి ఈ లెక్కలే ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ చిత్రం విదేశాల్లో బాగానే వసూళ్లు రాబట్టింది. మొత్తం 8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రెండవ వారాంతంలో ₹ 500 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనపడుతోంది. గురువారం నాడు, కాంతారా చాప్టర్ 1 బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ మొత్తం వసూళ్లను బ్రేక్ చేసింది. అటు 3 ఈడియట్స్ సహా ఎన్నో సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయి.