Friday, September 12, 2025 07:11 PM
Friday, September 12, 2025 07:11 PM
roots

పండుగనాడు కూడా ప్రాంతీయ విద్వేషమేనా కవితక్కా..?

పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. మాకు తిరుగే లేదని గొప్పలు చెప్పుకున్నారు. నా మాటే శాసనం అనే బాహుబలి సినిమాలో శివగామి డైలాగ్‌ తమకు వర్తిస్తుందన్నట్లుగా వ్యవహరించారు. ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అయినా సరే.. ఒక్క ఓటమితో కళ్లు బైర్లు కమ్మినట్లున్నాయి. చివరికి అభ్యర్థులు కూడా లేని దయనీయ దుస్థితికి పార్టీ దిగజారిపోవడంతో… మళ్లీ గాడిలో పడేందుకు పాత పాట పాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటింది. ఇప్పటికే మూడు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండుసార్లు బీఆర్ఎస్ గెలవగా… ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. అయితే ఓడిన తర్వాత పార్టీ మనుగడ కష్టమని భావించిన కారు పార్టీ నేతలు.. ఇప్పుడు మరోసారి సెంటిమెంట్ కార్డు వాడేస్తున్నారు.

Also Read : కూటమిలో ఎమ్మెల్సీ ఎన్నికల భయం..!

సరిగ్గా వారం రోజుల క్రితం భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆ పార్టీ ఇతర నేతలు కూడా వంత పాడుతున్నారు. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నేతలతో సమావేశాలు నిర్వహించారు కేసీఆర్. ఆ సమయంలో చంద్రబాబు ఎన్డీయే కూటమితో కలిసి తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని… మరోసారి ఆంధ్ర పాలకులు అవసరమా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తీసుకుంటున్నారన్నారు కేసీఆర్. అధినేత వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా.. మాజీ మంత్రి హరీష్ రావు మరో అడుగు ముందుకు వేశారు. నాగార్జున సాగర్ నీళ్లను ఆంధ్ర పాలకులు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆడించినట్లు ఆడుతున్నారన్నారు.

Also Read : అధ్యక్ష అంటావా.. ఇంట్లో ఉంటావా..?

ఇప్పుడు ఇదే తరహాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివరాత్రి పండుగ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కవిత. గుడి నుంచి బయటకు వచ్చిన దేవుడి దగ్గర ఆమె చెప్పిన మొదటి మాట ఆంధ్ర పాలకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్నకు సరిగ్గా పూజలు జరగలేదని.. కేసీఆర్ పాలనలోనే జరిగాయన్నట్లుగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో సిరిసిల్ల జిల్లాకు రాజన్న పేరు పెట్టారని చెప్పారు కవిత. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రూ.250 కోట్లు కేటాయించారని చెప్పిన కవిత… ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందంటూ విమర్శలు చేశారు.

Also Read : కారు స్టీరింగ్ పట్టుకునేది ఎవరు..?

అయితే కవిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓ జిల్లాకు రాజన్న పేరు పెడితే అభివృద్ధి చేసినట్లు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వేములవాడకు ఏటా రూ.వంద కోట్లు ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన గుర్తులేదా అని నిలదీస్తున్నారు. మరి పదేళ్ల పాలనలో రూ.వెయ్యి కోట్లు కేటాయించారా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి ఎలా ఉందో… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉందని విమర్శించారు. రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలంటే… మరోసారి ఆంధ్ర పాలకులంటూ విమర్శలు చేస్తే తప్ప గెలుపు సాధ్యం కాదనేది బీఆర్ఎస్ నేతల అంతర్గత మాట. అందుకే ప్రతి సమావేశంలో కూడా ఆంధ్ర పాలకులు అంటూ ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్