Saturday, September 13, 2025 01:19 AM
Saturday, September 13, 2025 01:19 AM
roots

కవిత కి బెయిల్.. బిజెపి, బిఆర్ఎస్ విలీనం వేగవంతం?

ఎట్టకేలకు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందరూ ఊహించిన విధంగానే బెయిల్ మంజూరు అయింది. దాదాపు నెల రోజుల నుంచి సుప్రీం కోర్ట్ లో నానుతున్న ఈ బెయిల్ ప్రక్రియ నేడు ముగిసింది. విడుదల కోసం నిరీక్షిస్తున్న కవిత ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అవుతున్నారు. సిబిఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ రావడంతో ఆమెను తీసుకొచ్చేందుకు కేటిఆర్, హరీష్ రావు జైలు వద్దకు వెళ్ళారు. నేడు బెయిల్ వస్తుందని నిన్ననే తెలుసుకున్న చిన్న సారు… తన బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్ళడం సంచలనం అయింది.

అయితే నిన్న కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన తీరు చూసి చాలా మందికి కవితకు బెయిల్ వస్తుందనే క్లారిటీ వచ్చేసింది. న్యాయస్థానం ఇచ్చే తీర్పుని ముందే కేటిఆర్ ఊహించి ఢిల్లీ వెళ్ళడం, గతంలో ఎప్పుడు విచారణ జరిగినా వెళ్లకపోవడం అనేవి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీటిని చూస్తున్న జనాలు ఖచ్చితంగా… బీఆర్ఎస్, బిజెపి మధ్య రాజీ జరిగిందని, అందుకనే కవితకు బెయిల్ వచ్చిందని అంటున్నారు. ఇప్పటి నుంచి విలీన ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ముందే తెలంగాణా సిఏం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

విలీనం జరగబోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇక ఇప్పుడు తెలంగాణాలో రాజకీయం రసవత్తరంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు విడివిడిగా కాంగ్రెస్ పై పోరాటం చేసిన బిజెపి, బీఆర్ఎస్ ఇప్పుడు బిజెపిగా పోరాటం చేస్తాయి. పొత్తు లేదంటే విలీనం ఖచ్చితంగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఏం జరుగుతుందో గాని తెలంగాణా రాజకీయం మాత్రం కచ్చితంగా హాట్ హాట్ గా ఉంటుంది అనే క్లారిటీ వచ్చింది.

బీఆర్ఎస్ ను బిజెపిలో కలుపుకోవడం తెలంగాణా బిజెపి నేతలకు అసలు నచ్చడం లేదు. కానీ అధికారం కావాలంటే తప్పదు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అటు మజ్లీస్ పార్టీ రాజకీయం కూడా ఆసక్తికరంగా మారబోతుంది. బిజెపిలో కలపడమో కలిసి నడవడమో తెలియదు గాని… బెయిల్ వస్తుందని తెలిసి 20 మంది ఎమ్మెల్యేలను కేటిఆర్ ఢిల్లీ తీసుకెళ్ళడం మాత్రం హైలెట్ బ్రో…!

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్