ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ లో అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం తీవ్ర దుమారమే రేపింది. భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వెళ్ళడం, ఆ తర్వాత షిప్ ను సీజ్ చేయాలని సినిమా రేంజ్ లో చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ఆ షిప్ ను సీజ్ చేసారా లేదా అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మొన్నీ మధ్య షిప్ ను సీజ్ చేసి అందులో ఉన్న బియ్యం అన్లోడ్ చేసారు అనే ప్రచారం జరిగింది. ఇక తాజాగా దీనిపై కాకినాడ కలెక్టర్ స్పష్టత ఇచ్చారు.
Also Read : మావ పాలన మరిచిన అల్లుడు.. సభ నిర్వహణపై పెద్ద పెద్ద మాటలు
ఆంధ్రప్రదేశ్ లో స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని పరోక్షంగా కలెక్టర్ చెప్పేశారు. గత నెల 29 న “సీజ్ ద షిప్” అని ఆదేశాలు ఇచ్చారు పవన్. ముందు షిప్ లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. రేషన్ బియ్యం కిందకి ఆన్ లోడ్ చేసిన తరువాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెప్తున్నారు. స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించామని షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది అన్నారు.
Also Read : శిరీష చేసింది నేరం అయితే మీరు చేస్తున్నది ఏంటి..?
ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తామన్నారు. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి అని ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించామన్నారు. దీనితో షిప్ లో బియ్యం అన్లోడ్ చేసి షిప్ వదిలేస్తారు అనే క్లారిటీ వచ్చింది. అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఉండవచ్చు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. షిప్ ను సీజ్ చేస్తే ఆ ప్రభావం అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనితో ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ముందుకు వెళ్ళడం లేదని సమాచారం.