అధికారం కోల్పోయి.. ఇబ్బంది పడుతున్న వైసీపీకి ఇప్పుడు కొంతమంది నేతలు చేసిన అవినీతి వ్యవహారాలు మరింత తలనొప్పిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారుతోంది. క్వార్ట్జ్ కుంభకోణం అలాగే భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, వాటి రవాణా కేసులో నిందితుల కదలికలపై పోలీసులు డేగ కన్ను వేయడంతో వైసిపి నేతల్లో ఆందోళన మొదలైంది.
Also Read : ఐఏఎస్ అయిన ఐటీ ఎంప్లాయ్.. గూగుల్ లో జాబ్ వదిలేసి మరీ…!
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహా ఇతర నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కాకాని ఇంటి వద్ద ప్రధాన గేట్లకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా అంటించారు. సోమవారం ఉదయం ఆయన 11 గంటలకు రూరల్ డిఎస్పి కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రిమాండ్ లో ఉన్న నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
Also Read : వర్మ కోసం వైసీపీ మైండ్ గేమ్..!
విచారణను న్యాయస్థానం మంగళవారం నాటికి వాయిదా వేసింది. ఇక ముందస్తు బెయిల్ కావాలి అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై కూడా మంగళవారం విచారణ జరగనుంది. ఇక నోటీసుల ప్రకారం సోమవారం ఉదయం ఆయన 11 గంటలకు హాజరు కావలసి ఉన్నా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అలాగే ఆయన పిఏ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది.
Also Read : ఎమ్మెల్సీ దువ్వాడ.. డాక్టరేట్‌లో నిజమెంత?
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ 4 గా ఉన్నారు. మరో ముగ్గురిపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కాకానితో సహా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని ఖనిజ నిక్షేపాలన్నింటిని కాకాని గోవర్ధన్ రెడ్డికి అప్పగించారు.