Wednesday, February 4, 2026 09:32 PM
Wednesday, February 4, 2026 09:32 PM

కాకాని పారిపోయారా..? కాపాడుతున్నారా..?

వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. అక్రమ వ్యవహారాలపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టిన సమయంలో.. ఆయన కనపడకుండా పోయారు. దాదాపు వారం పది రోజుల నుంచి కాకాని ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా ఎవరికి సమాచారం లేదు. తాను విచారణకు రావడంలేదనే సమాచారాన్ని కూడా ఆయన పోలీసులకు ఇవ్వడం లేదు. ఇప్పటికే అక్రమ ఖనిజం వ్యవహారంలో ఆయనతో పాటుగా పదిమందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Also Read : విడదల రజనీ జైలుకే.. కోర్ట్ ముందు సాక్ష్యాలు

నలుగురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇక తాజాగా ఈ వ్యవహారంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి.. చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. దీనితో అతనికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం హైదరాబాద్ తో పాటుగా బెంగళూరు, చెన్నై, అలాగే ముంబై నగరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల పోలీస్ అధికారులను కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరించే విధంగా మాట్లాడారు.

Also Read : అలా వెళ్ళడానికి ఏమాత్రం సిగ్గుపడను

దీంతో ఆయనకు భయపడే పోలీసులు అరెస్టు చేయడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక సోమవారం ఆయన.. ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటుగా కేసు కొట్టేయాలని పిటీషన్ పై కూడా వాదనలు జరగనున్నాయి. మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే కొంతమంది ఆయన బెంగుళూరు వెళ్లిపోయారని.. ఆయన ఎక్కడున్నారో పోలీసులకు సమాచారం కూడా ఉందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దీనిపై కూటమి పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. పోలీసులను బెదిరించిన సరే ధైర్యంగా అడుగులు వేయలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. సామాన్యులు విచారణకు రాకపోతే ఇలాగే ఊరుకుంటారా అంటూ మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్