Saturday, September 13, 2025 03:22 AM
Saturday, September 13, 2025 03:22 AM
roots

జగన్‌కు తలనొప్పిగా మారిన కడప..!

కడప అంటే చాలు… రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు. ఆ జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇంకా చెప్పాలంటే… వైఎస్ కుటుంబం చెప్పుచేతల్లోనే ఉంటుందనే మాట సరిగ్గా సరిపోతుంది కూడా. 2009 ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో బోటాబోటిగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ… కడప జిల్లాలో మాత్రం పది నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో విజయం సాధించింది. అలాంటి కడపలో ఇప్పుడు వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలంటే అది కడపలోనే సాధ్యమనేది చంద్రబాబు, పవన్ మాట. అందుకే వై నాట్ 175 అని జగన్ అంటే… అసలు వై నాట్ పులివెందుల అని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. అందుకే పులివెందులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీంతో 2019లో 90 వేల మెజారిటీ సాధించిన జగన్… 2024లో 40 వేలకు పడిపోయారు. ఇక పది రోజుల క్రితం జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో అయితే వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కొన్ని చోట్ల అయితే కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని పరిస్థితి.

Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ

ఇక ఎన్నికల తర్వాత కడపలో వైసీపీకి గడ్డుకాలం ఎదురైంది. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రెడ్డప్పగారి మాధవీ రెడ్డి మంత్రి అంజాద్ భాషాపై పోటీ చేసి ఏకంగా 18 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక నాటి నుంచి కడప అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ సమావేశాల్లో మేయర్‌తో అమీతుమీ పోరాడుతున్నారు. కార్పొరేటర్లు కొందరు టీడీపీ చేరడంలో మాధవి రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది.

Also Read : రేవంత్ తో మీటింగ్ దూరంగా చిరంజీవి.. ఇందుకేనా?

కడపలో పరిస్థితిపై ఇప్పటికే పలుమార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు జిల్లా నేతలు. ఇలాగే సైలెంట్‌గా ఉంటే… స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమి ఖాయమని చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జగన్… కడప నగరంలో పార్టీ పరిస్థితిపైన, జరుగుతున్న పరిణామాలపైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కడప వైసీపీ కార్పొరేటర్లను నేరుగా ఇడుపులపాయకు పిలిపించుకుని జగన్ మాట్లాడారు. అసలు కడప వైసీపీలో సంక్షోభం తలెత్తడం పట్ల జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్పొరేటర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కొందరు వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని తెలుసుకున్న జగన్… అలాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సొంతగడ్డపైనే సరైన నాయకత్వం లేదనే మాటను జగన్ గుర్తిస్తారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కడప బాధ్యతలను ఎంపీ వైవీ అవినాష్ రెడ్డికి అప్పగించారు. కానీ అవినాష్ వల్లే సాగునీట సంఘాల ఎన్నికలు ఓడిపోయామనేది పార్టీ కార్యకర్తల మాట. మరి జగన్ ఎలా వ్యవహరిస్తారో అని పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్