Friday, September 12, 2025 04:58 PM
Friday, September 12, 2025 04:58 PM
roots

కడపలో జగన్‌కు షాక్ ఇస్తోన్న టీడీపీ రెడ్లు

సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. రాయలసీమలో వైయస్ కుటుంబానికి పట్టు ఎక్కువ. ఒక అనంతపురం జిల్లా మినహా మిగిలిన మూడు జిల్లాల్లో వైఎస్ కుటుంబ ఆధిపత్యం దాదాపుగా ఉంటుంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కూడా వైఎస్ కుటుంబం పట్టు పెంచుకుంది. కానీ గత కొన్నాళ్లుగా రాయలసీమతో పాటుగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబ ప్రభావం తగ్గుతూ వస్తోంది. 2024 ఎన్నికల్లో ఈ విషయంలో క్లారిటీ క్లియర్ గా వచ్చింది. తాజాగా జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో కూడా స్వయంగా పులివెందుల నియోజకవర్గంలో వైయస్ కుటుంబం ఊహించని రిజల్ట్ వచ్చింది.

Also Read : పులివెందుల టీడీపీదే.. వైసీపీకి దక్కని డిపాజిట్ 

అయితే ఒకప్పుడు ఆ కుటుంబానికి బలంగా కనపడిన రెడ్డి సామాజిక వర్గమే ఇప్పుడు పెద్ద షాక్ ఇస్తోంది. కడప జిల్లాలో తమకు తిరుగు లేదనుకున్న వైసీపీకి.. 2024 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఘన విజయం సాధించి షాక్ ఇచ్చారు. కడప ఎంపీ స్థానంలో కూడా ఒకానొక సమయంలో అవినాష్ రెడ్డి ఓడిపోతారా అనే అనుమానాలు సైతం కలిగేలా ఆమె భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి సత్తా చాటారు. కడపలో నిర్వహించిన మహానాడులో అత్యంత విజయవంతం చేయడంలో రెడ్డప్ప గారి మాధవి రెడ్డి సక్సెస్ అయ్యారు.

Also Read : పవన్ సినిమా హీరో కాదు మినిస్టర్.. ప్రమోషన్లో ఫెయిల్ అవుతోన్న జనసేన

దీనికంటే ముందు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. భూమి రెడ్డి రాంభూపాల్ రెడ్డి ఘన విజయం సాధించి షాక్ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి దెబ్బకు వైయస్ కుటుంబం కడప జిల్లాలో ఇబ్బందులు పడింది. దాని కంటే ముందు 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి అలియాస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి.. వైఎస్ కుటుంబానికి చుక్కలు చూపించారు. ఇక ఇప్పుడు తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీటెక్ రవి సతీమణి లతారెడ్డి.. జడ్పీటీసీగా ఏకంగా 6000 పైచిలుక ఓట్లతో విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించింది. ఇలా రెడ్డి సామాజిక వర్గం జగన్ కు వ్యతిరేకంగా పనిచేయడంలో.. వైసీపీని కట్టడి చేయడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. వ్యాపారాలు చేసుకునే రెడ్డి సామాజిక వర్గంలోని కీలక వ్యక్తులు కూడా టిడిపి వైపు తిరగడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో ఇదే కొనసాగితే మాత్రం వైసిపి అక్కడ ప్రభావం కోల్పోవడం పెద్ద విషయం కాదంటున్నయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్