Wednesday, February 4, 2026 02:48 PM
Wednesday, February 4, 2026 02:48 PM

దేశ రాజధానిలో వాలిన తెలంగాణా ఈగల్..!

తెలంగాణాలో డ్రగ్స్ దందా విషయంలో సీరియస్ గా అడుగులు వేస్తోన్న ఈగల్ టీం ఇప్పుడు దేశ రాజధానిపై కూడా గురిపెట్టింది. తాజాగా ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌, తెలంగాణ ఈగల్‌ టీమ్‌ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న 11 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని సంచలనం సృష్టించాయి. రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఈగల్ టీం ప్రకటించింది. గార్మెంట్స్‌, కాస్మోటిక్స్‌, షూస్‌లో డ్రగ్స్‌ పెట్టి డెలివరీ చేస్తున్నారని, తెలంగాణలో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేశామని ఈగల్‌ టీమ్‌ ఎస్పీ వెల్లడించారు.

Also Read : బ్రేకింగ్: పిన్నెల్లి బ్రదర్స్ కు సుప్రీం బిగ్ షాక్..!

ఈగల్‌ టీమ్‌ ఆపరేషన్‌ లో ఒక్క ఢిల్లీలోనే 16 డ్రగ్స్‌ విక్రయ కేంద్రాలు గుర్తించారు అధికారులు. హైదరాబాద్‌ లోని మల్నాడు రెస్టారెంట్‌, మహేంద్ర యూనివర్సిటీ కేసులను విచారించగా డ్రగ్స్‌ మాఫియా బయటపడింది. నైజీరియాకు చెందిన నిక్కీ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ దందా చేస్తున్నట్టు తేల్చారు. సుమారు 2 వేల మందికి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు గుర్తించింది ఈగల్‌ టీమ్‌. వందలాది మ్యూల్‌ అకౌంట్లు ఏర్పాటు చేసి నగదు లావాదేవీలు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని డ్రగ్స్‌ దందా చేస్తున్నట్టు వెల్లడించారు.

Also Read : సిద్దరామయ్య సేఫేనా..? బలాలు ఇవే..!

ఢిల్లీలో 50 మంది నైజీరియన్‌ యువతీ, యువకులను అరెస్టు చేసింది. హైదరాబాద్‌లో 11 మంది డ్రగ్స్‌ పెడ్లర్లను గుర్తించిన ఈగల్‌ టీమ్‌.. సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో మహిళ ఫారినర్స్‌ తో ఉంటూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు తేల్చారు. ఇక ఏపీకి కూడా లింక్ లు ఉన్నట్టు వెల్లడి అయింది. వైజాగ్‌ ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విద్యార్థులతో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేసింది ఈగల్ టీం. రూ.15 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్