Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

జియో ఫేక్ వ్యూస్..? నిజంగా అంత మంది చూసారా…?

దుబాయ్ వేదికగా జరిగిన భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ కు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్లైన్లో ఊహించని వ్యూస్ వచ్చాయి. ఏకంగా 55 కోట్లమంది జియో హాట్ స్టార్ లో మ్యాచ్ చూసినట్టు లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఏ మ్యాచ్ కూడా ఇంతమంది చూడలేదు. ఇక స్టేడియంలో కూడా ఇదే స్థాయిలో హడావుడి కనపడింది. తెలుగు రాష్ట్రాల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు దుబాయ్ వెళ్లారు. హై వోల్టేజ్ మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా హాజరయ్యారు.

Also Read : ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. పాక్ తో మ్యాచ్ పై భారత్ ఫోకస్

ఈ మ్యాచ్ లో భారత్ మంచి విజయం సాధించడం.. ఈ విజయంతో సెమీఫైనల్ లో అడుగు పెట్టడంతో భారత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు హాట్ స్టార్ లో చూపించిన వ్యూస్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఏకంగా 55 కోట్ల మంది ఈ మ్యాచ్ ను వీక్షిస్తున్నట్టు కనబడుతున్న నెంబర్స్ నిజమా కాదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ప్రశ్న. అయితే జియో వాడే వాళ్ళందర్నీ వ్యూవర్స్ గా కలిపేశారని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మార్కెటింగ్ విషయంలో జియో యాజమాన్యం ముందుంటుంది.

Also Read : కోహ్లీ సెంచరీ అడ్డుకునే కుట్ర జరిగిందా…?

గతంలో కూడా ఐపీఎల్ విషయంలో ఇలాగే జియో సినిమా యాప్ లో గట్టిగా ప్రచారం చేశారు. అప్పుడు కూడా కోట్ల మంది చూస్తున్నట్లు హడావుడి జరిగింది. అయితే ఆ తర్వాత లెక్కలు ఫేక్ అని సోషల్ మీడియాలో కొంతమంది ప్రూఫ్ లు బయటపెట్టారు. ఇక ఇప్పుడు హాట్ స్టార్ లో ఏకంగా 55 కోట్ల మందికి పైగా మ్యాచ్ చూసినట్టు రావడం చూసి ఇతర ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్లు కూడా షాక్ అవుతున్నాయి. మరి టీవీలో అసలు మ్యాచ్ ఎవరూ చూడలేదా అంటూ షాక్ అవుతున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ మ్యాచ్ కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది. అటు టీవీలో కూడా భారీగా ఈ మ్యాచ్ ను వీక్షించారు. ఏకంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో సహా పలు కీలక నగరాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్