Friday, September 12, 2025 04:58 PM
Friday, September 12, 2025 04:58 PM
roots

ఎన్సియేలో బూమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ కష్టమేనా..??

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా… చాంపియన్ ట్రోఫీలో ఆడే అవకాశాలు ఉన్నాయా…? అంటే దీనిపై క్లారిటీ ఇప్పుడు కష్టంగానే ఉంది. అటు సెలక్షన్ కమిటీ గాని ఇటు బోర్డు గానీ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పడిన.. బూమ్రా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ అలాగే వన్డే సిరీస్ లకు దూరమయ్యాడు. గత కొంతకాలంగా రెస్ట్ మోడ్ లో ఉన్న బూమ్రా ఆదివారం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు.

Also Read : మంత్రులకు సీఎం భయం.. సచివాలయం వదలట్లేదు..!

అతని గాయం, ఫిట్నెస్ పై ఎన్సీఏలో పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యుల నివేదిక ఆధారంగా అతనిపై సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈనెల 11 లోపు అతను జట్టులో చేరితే కచ్చితంగా అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 11 లోపు చాంపియన్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉండటంతో అతని ఫిట్నెస్ పై ఉత్కంఠ నెలకొంది. అతను గనుక తుదిజట్టులో ఆడకపోతే కచ్చితంగా జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

Also Read : రికార్డుల దుమ్ము దులిపిన యువీ శిష్యుడు

ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే హర్షిత్ రానాను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అతని స్థానంలో హర్షిత్ రానా ను ఎంపిక చేశారు. ఒకవేళ మెగా టోర్నీలో బూమ్రా అందుబాటులో లేకపోతే రానానే ఛాంపియన్ ట్రోఫీలో కొనసాగించనున్నారు. ఇక అతనితో పాటుగా సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ జట్టులో ఉండే అవకాశం ఉంది. దుబాయ్ పిచ్ లు, ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కచ్చితంగా బూమ్రా లేకపోవడం భారత జట్టుకు లోటని మాజీలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్