బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు హీరోలు కోరుకునే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాలు చేస్తోంది. త్వరలోనే మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం కాబోతోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ జాన్వీ చేయబోయే పాన్ ఇండియా మూవీ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
తెలుగు అమ్మాయి అయినా అప్పట్లోనే ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. అందంతోనే కాదు అభినయంతో కూడా అందరినీ ఆకట్టుకున్న ఆమె అనూహ్యంగా దుబాయిలో మరణించి అభిమానులను దుఃఖ సాగరంలో ముంచేసింది. అయితే శ్రీదేవి నట వారసురాలిగా ఆమె ఇద్దరు కూతుళ్లు సినీ రంగ ప్రవేశం చేసేశారు.
మొదటి కుమార్తె జాహ్నవి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. అయితే హిందీలో ఆమె చేసిన సినిమాలన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు లేదా ప్రయోగాత్మక సినిమాలే అవుతూ వచ్చాయి. కమర్షియల్ ఛాన్సులు పెద్దగా రాలేదు జాన్వీకి. ఈ క్రమంలోనే టాప్ హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా సౌత్ ముద్ర ఉండాలని భావించారో ఏమో తెలియదు కానీ ఏకంగా తెలుగులో రెండు భారీ ప్రాజెక్టుల్లో జాన్వీ భాగమైంది.
ముందుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె దశ మారిపోతుందని అందరూ అనుకున్నారు. ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడి అక్టోబర్ నెలకి వెళ్లింది. అయితేనే ఈలోపే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 16వ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ ఛాన్స్ పట్టేసింది. పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు సోషల్ మీడియా, టాలీవుడ్ వర్గాల్లో జాన్వీకి మరో అదిరిపోయే ఆఫర్ దక్కినట్టు రూమర్లు వైరల్ అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మహేష్ బాబు 29వ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా ఎంపికైందని బాలీవుడ్ మీడియాలో పేర్లను తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ జాన్వీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనే వార్త వైరల్ అవుతోంది.