Saturday, October 25, 2025 08:36 PM
Saturday, October 25, 2025 08:36 PM
roots

కేంద్ర కేబినెట్ లోకి జనసేన ఎంపీ…?

దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో దక్షిణాది రాష్ట్రాల విషయంలో చిన్న చూపు చూసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల విషయంలో కూడా కాస్త పెద్ద చేయి అందిస్తోంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలకు కూడా బిజెపి నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు.

Also Read : ఎమ్మెల్యే పెత్తనం.. కార్యకర్త నరకం.!

గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ నుంచి కూడా క్యాబినెట్ లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉందని భావించారు. కానీ కొన్ని కారణాలతో పదవి కేటాయించలేకపోయారు. అయితే డిసెంబర్ లో జరగబోయే కేంద్ర క్యాబినెట్ మార్పుల్లో భాగంగా జనసేన పార్టీకి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన క్లారిటీ కూడా ఇచ్చినట్లు సమాచారం. దాదాపుగా బందరు ఎంపీ బాలసౌరి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

Also Read : ఆస్ట్రేలియా వెళ్ళండి.. సీనియర్లకు బోర్డు ఆర్డర్

ఆయనకు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉండటమే కాకుండా.. కష్టపడే తత్వం ఉన్న నాయకుడిగా కూడా గుర్తింపు ఉంది. 2019లో బందరు నుంచి తొలిసారి గెలిచిన బాలసౌరి ఆ తర్వాత నియోజకవర్గానికి పెద్దపీట వేశారు. ఎంపీ నిధులను భారీగా ఖర్చుపెట్టారు. సొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు అనే పేరు ఉంది. దానికి తోడు తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన సన్నిహితంగానే ఉంటారు. దీనితో ఇవన్నీ లెక్కేసుకుని బిజెపి ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు పలికినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్