Sunday, March 22, 2026 05:01 AM
Sunday, March 22, 2026 05:01 AM

కొడాలి, వల్లభనేనికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..?

వైసీపీ అధికారం కోల్పోవడం ఏమో గాని ఆ పార్టీ నాయకులు.. ఒకరి తర్వాత ఒకరు సైలెంట్ అయిపోవడం.. ఆ పార్టీ కార్యకర్తలను, మాజీ సిఎం జగన్ ను తీవ్రంగా కలవరపెట్టే అంశం. అధినేతగా తాను ఎన్ని సూచనలు చేసినా, ఆదేశాలు ఇచ్చినా సరే నాయకులు మాత్రం కనపడటం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దూకుడుగా ఉన్న మాజీ మంత్రులు పేర్ని నానీ, కొడాలి నానీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.

Also Read : బ్రేకింగ్: రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం షాక్..!

అరెస్ట్ తర్వాత వంశీ.. పెద్దగా మీడియాకు కనపడటం లేదు. మాట్లాడటం లేదు కూడా.. అలాగే నియోజకవర్గ నాయకులతో చర్చలు గాని, పర్యటనలు గానీ.. చేయడం లేదు వంశీ. ఇక కొడాలి నానీ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇటీవల తిరుమల వెళ్లి వచ్చిన ఆయన.. నియోజకవర్గానికి మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నారు. ఏవైనా వ్యక్తిగత కార్యక్రమాలు ఉంటే మాత్రమే ఆయన గుడివాడ వస్తున్నారు. లేదంటే బెజవాడకు కూడా దూరంగానే ఉంటున్నారు. అలాగే మొన్నటి వరకు హడావుడి చేసిన పేర్ని నానీ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

నానీ.. దూకుడుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసారు. కానీ బందరు నియోజకవర్గంలో మాత్రం ఆయన పర్యటించడం లేదు. ఈ నేపధ్యంలో.. అధినేత జగన్.. ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాలకు ముగ్గురు నేతలు దూరంగా ఉండటాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. తాను ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నా సరే.. హైదరాబాద్ లేదా బెంగళూరుకే పరిమితమైన మొత్తం 20 మంది నేతలకు జగన్ క్లాస్ తీసుకున్నారట. ఒక్క రోజే 20 మందిని పిలిచి జగన్ మాట్లాడారు.

Also Read : చలికాలంలో వేడి నీటి స్నానం – జాగ్రత్తలు మర్చిపోతే ఇబ్బందులే

నియోజకవర్గాల్లో తిరగలేము లేదా పార్టీ బాధ్యతలు చూడలేము అని చెప్పేస్తే తాను వేరే నాయకులను చూసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చారట. కేసుల భయంతో దూరంగా ఉంటున్న నాయకులు.. నియోజకవర్గాల్లో తిరిగి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, అధికార పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలను సైతం నిలదీయడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారట. దీనితో మీ స్థానంలో వేరే వారికి అవకాశం ఇస్తానని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారట. మీరే సైలెంట్ గా ఉంటే కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వస్తారని కూడా జగన్ ప్రశ్నించారట. మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, చింతలపూడి అశోక్, కొటారు అబ్బయ్య చౌదరికి జగన్ ఈ విధంగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్