వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. చెల్లెలితో విభేదాలు ఎక్కడి వరకు వెళ్తాయో అనే ఆందోళన వైసీపీ నేతల్లో తారా స్థాయిలో ఉంది. 2014 నుంచి షర్మిల రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ ఉండగా అప్పటి నుంచి ఆమె ఎవరిపై పోరాటం చేసినా సరే రాజకీయంగా భూస్థాపితం అవుతున్నారనే సెంటిమెంట్ కూడా వైసీపీ నేతల్లో అలజడికి కారణం అవుతోంది. 2014 లో షర్మిల కాంగ్రెస్ పై పోరాటం చేసారు. జగన్ కు మద్దతుగా ఆమె ప్రచారం కూడా నిర్వహించి కాంగ్రెస్ ను టార్గెట్ చేసారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కోలుకోలేదు అనే సంగతి అందరికి క్లారిటీ ఉంది. ఇక 2019 ఎన్నికల్లో బై బై బాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేసారు షర్మిల. ఆ తర్వాత టీడీపీ దారుణంగా ఓటమి పాలైంది. ఇక 2023 ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ పై పోరాటం చేయగా ఆ పార్టీ కూడా దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయింది. ఇక 2024 ఎన్నికల్లో ఆమె వైఎస్ జగన్ పై పోరాటానికి దిగారు. వైసీపీ రాజకీయ భవిష్యత్తు కూడా దాదాపు ముగిసినట్టే అనే కామెంట్స్ వినపడుతున్నాయి. వైసీపీని ఒక్కొక్కరు వీడుతూ కూటమి పార్టీల్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ పై ఆమె దాదాపుగా ఆస్తుల కోసం యుద్దమే చేస్తున్నారు.
Also Read : వంగవీటి వారసుడికి భరోసా
ఈ విషయంలో జగన్ కూడా వెనకడుగు వేయడం లేదు. షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు. ఆమె ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు ను టార్గెట్ చేయడం ఖాయంగా కనపడుతోంది. ప్రజా పోరాటాల్లో షర్మిల దూకుడుగానే ఉన్నారు. ఆస్తుల విషయంలో జగన్ రాజీకి వెళ్ళకుండా ఉంటే మాత్రం షర్మిల దూకుడు తగ్గే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ కు కూడా జగన్ ను దగ్గర చేయించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇక షర్మిల కత్తికి రెండు వైపులా పదును ఉందనే భావన ఉంది. ఆమె ఇటు టీడీపీ కి కూడా దగ్గరగానే ఉన్నారు. అటు కాంగ్రెస్ కు దగ్గరగానే ఉన్నారు. ఎటు నుంచి ఎటు చూసినా జగన్ కు సమస్యలే అనే అభిప్రాయం వినపడుతోంది.




