Friday, September 12, 2025 05:26 PM
Friday, September 12, 2025 05:26 PM
roots

మాటలేనా.. నిజంగా చేతల్లో చూపించే దమ్ముందా?

వైసీపీ అధినేత వైయస్ జగన్ చాలా రోజుల తర్వాత మీడియాలో సందడి చేశారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నుంచి జగన్ 2.0 చూస్తారు అంటూ ఆయన కామెంట్ చేశారు. కార్యకర్తల జోలికి వస్తే తాను ఏం చేస్తానో చూపిస్తానని.. వైసీపీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనని ఎవరు ఏం పీకలేరని… వైసీపీ బ్రతుకుతుందని, ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తుందని, మళ్లీ ముఖ్యమంత్రి అవుతాను అంటూ జగన్ కామెంట్ చేశారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన్ చేసి ఉంటే ఇప్పుడు ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చేది కాదు కదా అన్న వ్యాఖ్యలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

Also Read: ఏపీలో ప్రభుత్వం మారిందా.. లేక..!

ఇక ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఎన్నో ఒపీనియన్స్ వినపడుతున్నాయి. అయితే వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ కావడంతోనే వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చేందుకు జగన్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అరెస్టులతో వైసిపి సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియక చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. కనీసం జగన్ ఫోటో పెట్టుకునేందుకు కూడా భయపడుతున్నారు. దీనితో వైయస్ జగన్ వాళ్ళలో ధైర్యాన్ని నింపేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల పై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటివి ఏమీ లేకుండా వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం వాడుతున్న సోషల్ మీడియా వ్యక్తుల పై కేసులు నమోదు చేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొంది.

Also Read: సీఎం చంద్రబాబే.. చీఫ్ మాత్రం పెద్దిరెడ్డి.. చిత్తూరులో వింత…!

ఇక తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసిపి సోషల్ మీడియా ఆఫీస్ కూడా ఓపెన్ చేసేందుకు జగన్ రెడీ అయ్యారు. ఇదే టైంలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి మళ్లీ రంగంలోకి దింపాలని.. నేతలకు కూడా ఆయన సూచనలు సలహాలు చేశారు. అందుకే కార్యకర్తలపై జగన్ కొత్తగా ప్రేమ చూపిస్తున్నారని, గతంలో లేనివిధంగా ప్రేమ కనపడుతోందంటూ కొంతమంది ఆశ్చర్య౦ వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలను అసలు పట్టించుకోలేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. మరి ఇప్పుడు అనూహ్యంగా జగన్ వారి పై ప్రేమ చూపించడం మాత్రం కాస్త విడ్డూరంగానే ఉంది. ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని పార్టీలు, అధికారం పోయాక మాత్రం కార్యకర్తల జపం చేస్తుంటారు అన్న సెటైర్లు బాగా వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్