ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రజలు తరఫున పోరాటం చేస్తామని.. పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నది. అయినా సరే ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం బయటకు రాలేదు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో జగన్ ప్రచారాల గురించి పోరాటాల గురించి పెద్ద ఎత్తున హడావుడి జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాబోతున్నారని.. ఆయన కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టబోతున్నారని చాలామంది ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు జగన్ ఒక్కటంటే ఒక్క ప్రజా పోరాటం కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో చేయలేదని చెప్పాలి.
Also Read : ఆయన ఆదేశించాడు.. మేము పాటించామంతే..!
అటు వైసీపీ నేతలు కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. కేసుల భయమో.. జగన్ పై నమ్మకం లేకనో తెలియదు గానీ వైసీపీ నేతలు పెద్దగా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇక తాజాగా బడ్జెట్ పై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని ఎదురు చూశారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్ నుంచి గాని వైసీపీ నేతలు నుంచి గాని ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు కనబడలేదని చెప్పాలి. ఇక వైసిపి నేతలు కూడా జగన్ మాటలను సీరియస్ గా తీసుకోవడాన్ని పక్కన పెట్టేసినట్లుగానే తెలుస్తోంది.
Also Read : ఆ రూల్ మార్చండి.. టీటీడీకి వినతులు..!
ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పై పోరాటం చేయాలని.. ఎప్పుడో పిలుపునిచ్చినా.. ఇప్పటివరకు అది ముందుకు వెళ్లలేదు. వరుసగా తేదీలు మారుస్తూ వస్తున్నారు. దీనితో వైసిపి నేతల్లో దీనిపై ఆసక్తి చచ్చిపోయింది. సూపర్ సిక్స్ హామీల విషయంలో కూడా ఇలాగే జరిగింది. చివరకు ప్రభుత్వం.. బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఇక అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్లకపోవడం.. కనీసం మీడియా సమావేశాలు కూడా లైవ్ పెట్టకపోవడాన్ని వైసీపీ సోషల్ మీడియా సీరియస్ గా తీసుకుంది. జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా వైసిపి సోషల్ మీడియా రియాక్షన్ చాలా తక్కువగానే ఉంటుంది.