Saturday, September 13, 2025 03:25 AM
Saturday, September 13, 2025 03:25 AM
roots

అధికారులను వెంటాడుతున్నారు.. సిద్దమవుతున్న మరిన్ని కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్ళ నుంచి కొందరు అధికారులు ఏ రేంజ్ లో చెలరేగిపోయారో చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకుల ఆదేశాలతో తాము ప్రభుత్వ ఉద్యోగులం అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించారు చాలా మంది అధికారులు. ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే కాదు రాజకీయ నాయకులపై పగను తాము కూడా పంచుకున్నారు. ఇప్పుడు వారిది ఒక్కొక్కరిది బెండ్ తీస్తోంది కూటమి సర్కార్. వరుసగా అధికారులపై కేసులు నమోదు అవుతున్నాయి.

Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పలువురు ఉన్నతాధికారులపై వరుస కేసులు నమోదు చేసారు. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్నవారిపై భారీగా కేసులు నమోదు అయ్యాయి. మదనపల్లి ఫైల్స్ నుండి కేసుల పర్వం మొదలైంది. లిక్కర్, మైనింగ్, సాండ్ ,కాకినాడ పోర్ట్ అవకతవకలపై ఇప్పటికే భారీగా సీఐడీ కేసులు నమోదు చేసింది. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా పోస్టింగ్స్ పై భారీ ఎత్తున కేసులు నమోదు అయ్యాయి.

Also Read : జగన్‌కు తలనొప్పిగా మారిన కడప..!

ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక సీట్ ఏర్పాటు చేసారు. ముంబై నటి జేత్వాని కేస్ లో పలువురు ఐపీఎస్ అధికారులపై ఇంకా విచారణ కొనసాగుతోంది. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ సీఐడీ చీఫ్, ఫైర్ డీజీ తో పాటు సమాచార శాఖ కమిషనర్ పై ఏసీబీ కేస్ నమోదు చేసింది. ప్రస్తుతం ఫైబర్ నెట్ అవకతవకలపై కేసులకు రంగం సిద్ధం చేసారు. ఒకవైపు సిఐడి మరోవైపు ఏసీబీ తమ విధులు నిర్వహిస్తుంటే… కాకినాడ పోర్టు బదలలింపు వ్యవహారంలో రంగంలోకి ఈడి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా కేసులు నమోదు కానున్నాయి. చాలా కేసుల్లో ఇప్పటికే విచారణకు హాజరవుతున్న అధికారులు… కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అధికారులకు ఉచ్చు బిగుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్